Kottu Satyanarayana: జగన్‌కు మాజీ మంత్రి ఊహించని షాక్
AP: జగన్‌కు మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ షాక్ ఇచ్చారు. జగన్ ప్రజా ప్రతినిధులకు, నేతలకు సముచిత స్థానం ఇవ్వలేదని అన్నారు. జగన్ చేసిన తప్పులే వైసిపి పరాజయానికి కారణం అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
AP: జగన్‌కు మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ షాక్ ఇచ్చారు. జగన్ ప్రజా ప్రతినిధులకు, నేతలకు సముచిత స్థానం ఇవ్వలేదని అన్నారు. జగన్ చేసిన తప్పులే వైసిపి పరాజయానికి కారణం అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
లంక గ్రామాల్లో మంచి నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చేపడతామన్నారు జనసేన ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు. తనను భారీ మెజారిటీతో గెలిపించినందుకు ఉంగుటూరు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని అన్నారు.
జగన్ ఐదేళ్లలో దోచుకున్నదంతా కక్కిస్తామన్నారు ఆచంట నియోజకవర్గ ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ. వైసీపీ అధికారం కోల్పోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. త్వరలో జగన్ మినహా.. మరో 10 మంది నేతలు టీడీపీలోకి రావడం ఖాయమన్నారు.
ఎన్డీయే కూటమిలో భాగమైన ప్రతి పార్టీకి కేంద్రంలో సహాయ మంత్రి పదవి ఇవ్వాలని బీజేపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంతో రెండు ఎంపీ స్థానాల్లో గెలిచిన జనసేనకు సైతం కేంద్రంలో ఒక సహాయ మంత్రి పదవి దక్కనుంది.
అధిక మెజార్టీతో నగరంలో చరిత్ర సృష్టించామన్నారు రాజమండ్రి సిటీ టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి. నగరాభివృద్ధికి తాము ప్రకటించిన మ్యానిఫెస్టోకు కట్టుబడి ఉన్నామన్నారు. తనను, తన కుటుంబసభ్యులను వైసీపీ వారు చాలా ఇబ్బంది పెట్టారని.. ఎన్నో ప్రలోభాలకు గురి చేశారని ఆరోపించారు.
AP: కాపు నేత ముద్రగడ పద్మనాభం కీలక ప్రకటన చేశారు. తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటున్నట్లు చెప్పారు. కాగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్‌ను ఓడించకపోతే తన పేరును మార్చుకుంటానని ఆయన సవాల్ చేసిన విషయం తెలిసిందే.
రాష్ట్రంలో RTV సర్వే ప్రభంజనం సృష్టించిందన్నారు కృషంరాజు భార్య శ్యామల దేవి. తాను RTV ప్రక్షకురాలిని అని.. రవి ప్రకాష్ సర్వే సూపర్ అని ప్రశంసించారు. RTV సర్వే నిజమైందని.. ఏపీ ఎన్నికల ఫలితాల్లో కూటమి ప్రభంజనం కొనసాగుతుందని హర్షం వ్యక్తం చేశారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి మరో విజయం దక్కింది. ఉమ్మడి ప.గో. జిల్లా పాలకొల్లులో నిమ్మల రామానాయుడు 60వేల ఓట్లకు పైగా మెజారిటీతో విజయం సాధించారు. నిమ్మలకు వరుసగా ఇది మూడో విజయం. వైసీపీ ఇంకా ఖాతా తెరవలేదు.
ఎన్నికల విషయంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజల తీర్పు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారాన్ని సాధిస్తుంది అనే దాన్ని తేల్చేస్తుంది. 2004 నుంచి ఇక్కడ అధికంగా సీట్లు సాధించిన పార్టీ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకుంటోంది. అదెలానో ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు