విశాఖలో దారుణం.. వృద్ధురాలిని హత్య చేసిన వాలంటీర్
విశాఖలో నగరంలో దారుణం జరిగింది. ఓ వృద్ధురాలిని గ్రామ వాలంటీర్(Volunteer)హత్య చేశాడు. సుజాతనగర్(Sujatanagar)లో ఈ ఘటన చోటుచేసుకుంది. బంగారు గొలుసు కోసం వృద్దురాలిని వాలంటీర్ హతమార్చడం కలకలం రేపింది.
విశాఖలో నగరంలో దారుణం జరిగింది. ఓ వృద్ధురాలిని గ్రామ వాలంటీర్(Volunteer)హత్య చేశాడు. సుజాతనగర్(Sujatanagar)లో ఈ ఘటన చోటుచేసుకుంది. బంగారు గొలుసు కోసం వృద్దురాలిని వాలంటీర్ హతమార్చడం కలకలం రేపింది.
గత కొంతకాలంగా గోవా టూ శ్రీకాకుళం వయా విశాఖపట్నం యదేచ్ఛగా లిక్కర్ రవాణా సాగుతోందని పోలీసుల సమాచారం. దీనికోసం ఓ ముగ్గురు ముఠాకట్టారు. విజయనగరం జిల్లాకు చెందిన పొద్దిలాపూర్ సత్యనారాయణ, ధనుంజయ, శ్రీకాకుళం జిల్లాకు చెందిన గొర్ల లక్ష్మణ్ భాగస్వాములుగా ఉన్నారు. విజయనగరం సత్యనారాయణ ఈ దందాలో ప్రధాన నిందితుడు. అతడు గోవాలో చీప్ లిక్కర్ రూ.26 కొని రూ. 92 కు శ్రీకాకుళం లక్ష్మణ్ కి అమ్ముతాడు. అతను రూ. 100 కి ధనుంజయకు అమ్ముతాడు.ధనుంజయ రూ. 120కు లోకల్ మందుబాబులకు అమ్ముతాడు. గోవా నుంచి బాక్సులకు బాాక్సులు లిక్కర్ వాస్కోడీగామా ట్రైన్ లో వైజాగ్ కు తరలిస్తారు.ఈ సరుకుని వివిధ బస్ రూట్లలో పలు ప్రాంతాలకు తరలిస్తారు.డిప్యూటీ కమిషనర్ బాబ్జి రావు, జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసరావు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని ప్రకటనలో తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి తరచూ వస్తున్న ప్రయాణికుల పై నిఘా పెంచారు.
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి విశాఖలో పర్యటించారు. విశాఖ జిల్లా స్థాయి పార్లమెంట్ స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆమె.. పలు అంశాలతోపాటు ఉత్తరాంధ్రలో బీజేపీ బలంపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పురందేశ్వరి సీఎం జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అవినీతి పలన నడుస్తోందన్నారు. రాష్ట్రంలో వైసీపీ నాయకులు ప్రజలను బెదిరించి భూములను లాక్కుంటోందని ఆరోపించారు.
హైదరాబాద్‌లో (hyderabad) చదువుతున్న ఐఐటీ విద్యార్థిపై( iit student) విశాఖలో లుక్ అవుట్ నోటీస్ జారీ చేయడం ఆసక్తికరంగా మారింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని వాటర్ ట్యాంక్ తండాకు చెందిన దనావత్ కార్తిక్ నాయక్ హైదరాబాద్ ఐఐటీలో చదువుతున్నాడు. అయితే అతడు ఎవరికీ చెప్పకుండా కాలేజీ నుంచి వెళ్లిపోయాడు. కార్తీక్ ఈనెల 17న కాలేజీ నుంచి బయటకి వచ్చి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. అక్కడ నుంచి జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కి విశాఖపట్టణం (vizag) వెళ్లాడు.
తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావారణ శాఖ అలెర్ట్ ఇచ్చింది. రానున్న రెండు రోజుల పాటు(జులై 25,జులై 26) తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నాయి. మరోవైపు ఈనెల 27 వరకు చేపల వేటకు వెళ్లద్దని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు.
ఏపీ రాజకీయాలను గతంలో ఎవరు శాసించని విధంగా శాసిస్తున్న సీఎం జగన్‌కు ఒక్క ప్రాంతం మాత్రం తలనొప్పిగా మారిందట. 2014 నుంచి ఆ ప్రాంతం మీద పట్టు సాధించలేకపోతున్నామని ఆవేదన ఉందట. తన తల్లిని ఓడించిన ప్రాంతంపై ఇప్పటికి జగన్ పట్టు సాధించలేకపోతున్నామని వాపోతున్నారట. ఇప్పుడు ఆ ప్రాంతంపై పట్టు కోసం ఏకంగా తన బాబాయిని రంగంలోకి దింపారు జగన్.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉత్తరాంధ్రలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత పంచకర్ల రమేష్ బాబు జనసేనలో చేరనున్నారు. ఈ మేరకు మంగళగిరిలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను కలిసి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నారు.
సీఎం జగన్ ప్రభుత్వానికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. పార్టీ కార్యకర్తలకు న్యాయం చేయలేకపోయానని క్షమించమంటూ వేడుకున్నారు. జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి.. పార్టీకి రాజీనామా చేస్తున్నానని.. బాధగా ఉందని పంచకర్ల రమేష్‌బాబు లేఖలో వెల్లడించారు.
విశాఖలో ఉండే వారికైనా... విశాఖ వెళ్లే వారికైనా రుషికొండ బీచ్ అనేది మంచి టూరిస్ట్ స్పాట్. బీచ్‌లోకి వెళ్లడానికి ఎలాంటి ఖర్చూ ఉండదు. అందుకే హాయిగా వెళ్లి సముద్ర తీరాన్ని ఎంజాయ్ చేసి వస్తారు. అలసిపోయిన వారు సేద తీరుతారు. అయితే ఇక నుంచి రుషికొండ బీచ్‌కు వెల్లాలంటే టిక్కెట్ కొనాల్సిందే. లేకపోతే అడుగు పెట్టనీయరు. టిక్కెట్ ధరను రూ. 20గా నిర్ణయించారు.