విశాఖ పట్టణంలో పవన్ కళ్యాణ్ ‘వారాహి విజయ యాత్ర’ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ యాత్రకి అన్ని రకాల ఏర్పాట్లను జనసేన పార్టీ సిద్ధం చేసింది. ఈ యాత్రకు భారీ స్పందన వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే రెండ విడతల యాత్ర పూర్తి చేసిన యాత్రకి భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ యాత్ర కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో వారాహి యాత్రకి పోలీసులు పలు ఆంక్షలు విధించారు.
పూర్తిగా చదవండి..Varahi Yatra: పవన్ ‘వారాహి యాత్ర’కు ఆంక్షలు.. జనసేన సీరియస్!
మూడో విడత వారాహి యాత్రకు కొన్ని షరతులతో, పలు నిబంధనలు జారీ చేశారు పోలీసులు. నగరంలో ఎలాంటి ర్యాలీలు నిర్వహించవద్దని, ఎయిర్ పోర్టు నుంచి ర్యాలీగా రావద్దని పోలీసులు చెప్పారు. అలాగే విశాఖలోని జగదాంబ జంక్షన్ లో ఏర్పాటు చేసే బహిరంగ సభకు పోలీసులు అనుమతి మంజూరు చేశారు. అలాగే ఈ యాత్రలో ఎలాంటి ఉల్లంఘనలు జరిగినా అనుమతి తీసుకున్న వారిదే బాధ్యత అంటూ పోలీసులు షరతులు విధించారు.
Translate this News: