పుంగనూరులో చంద్రబాబు ర్యాలీపై రాళ్ల దాడిని ఖండిస్తూ టీడీపీ నేతల ర్యాలీలు

పుంగనూరులో చంద్రబాబు కాన్వాయ్‌తో పాటు టీడీపీ శ్రేణులపై వైసీపీ కార్యకర్తల రాళ్లదాడిని టీడీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. దాడులకు పాల్పడిన వైసీపీ మూకలను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

New Update
పుంగనూరులో చంద్రబాబు ర్యాలీపై రాళ్ల దాడిని ఖండిస్తూ టీడీపీ నేతల ర్యాలీలు

పుంగనూరులో చంద్రబాబు కాన్వాయ్‌తో పాటు టీడీపీ శ్రేణులపై వైసీపీ కార్యకర్తల రాళ్లదాడిని టీడీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. దాడులకు పాల్పడిన వైసీపీ మూకలను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు ఆందోళనకు దిగుతున్నారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయిందని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. దాడులకు పాల్పడిన వైసీపీ మూకలను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందని.. అందుకే అరాచకాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

పుంగనూరలో చోటుచేసుకున్న ఘటనపై డీజీపీకి టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య లేఖ రాశారు. లేఖతో పాటు ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్, గాయాలపాలైన టీడీపీ కార్యకర్తల ఫోటోలను పంపించారు. మరోసారి కురబలకోట మండలం అంగళ్లు గ్రామంలో వైసీపీ గూండాలు టీడీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులే చంద్రబాబు కాన్వాయ్‌పై దాడి చేశారని లేఖలో పేర్కొన్నారు. ఈ దాడిలో తెలుగుదేశం కార్యకర్తలు తీవ్ర గాయాలపాలయ్యారన్నారు. పెద్దిరెడ్డి ప్రోద్బలంతో టీడీపీ ఫ్లెక్సీలు సైతం తొలగించారన్నారు. గతంలో కూడా నందిగామ, ఎర్రగొండపాలెంలో చంద్రబాబుపై దాడులు జరిగాయని గుర్తుచేశారు. శాంతి భద్రతలకు నిర్లక్ష్యం వహించిన పోలీస్ అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

పుంగనూరులో చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్లదాడికి నిరసనగా అరకు లోయలో టీడీపీ శ్రేణులు రాస్తారోకో చేపట్టారు. మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హోంమంత్రి వనిత వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అరకులోయ నాలుగు రోడ్ల కూడలిలో పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. పోలీసులు ప్రభుత్వానికి కొమ్ముకొస్తున్నారని.. మంత్రి పెద్దిరెడ్డి పతనం ప్రారంభమైందని కిడారి శ్రావణ్ హెచ్చరించారు. మరోవైపు ఉమ్మడి విశాఖ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు