AP: నాలుగో పెళ్లి చేసుకున్న దొంగమొగుడు.. విడాకులు కావాలంటున్న మూడో భార్య..!
విశాఖలో నిత్య పెళ్లికొడుకుపై మూడో భార్య కలెక్టర్కు ఫిర్యాదు చేసింది. నాలుగు పెళ్లిళ్లు చేసుకొని తనను మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. అడిగితే తనను చంపేస్తానని బెదిరిస్తున్నాడని వాపోయింది. తనకు న్యాయం చేసి ఆదుకోవాలని కలెక్టర్ వద్ద వేడుకొంది.