Visakha MLC Election : ఏపీలో నేటి నుంచి ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికకు 13వ తేదీ వరకు నామినేషన్లకు గడువు ఉంది. 14న నామినేషన్ల పరిశీలన జరగనుంది. 16వ తేదీ వరకు నామినేషన్ల ఉప సంహరణకు గడువు ఉంది. ఈనెల 30న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి.
ఎక్స్ ఆఫిషియో మెంబర్లతో కలిసి మొత్తం ఓట్లు 841 ఉన్నాయి. వైసీపీకి 615, టీడీపీకి 215 ఓట్లు ఉండగా.. 11 ఖాళీలు ఉన్నాయి. గతంలో ఇక్కడి నుంచి వైసీపీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికైన వంశీకృష్ణయాదవ్ ఎన్నికల ముందు జనసేనలో చేరారు. వైసీపీ ఫిర్యాదుతో ఆ వెంటనే అతనిపై మండలి చైర్మన్ అనర్హత వేటు వేశారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నికకు ఈసీ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే బొత్స సత్యనారాయణకు వైసీపీ టికెట్ ఖరారు చేసింది. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు.
MLC Election : ఏపీలో మరో ఎన్నికకు మోగిన నగారా
AP: ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికకు నామినేషన్ ప్రక్రియ ఈరోజు నుంచి మొదలైంది. 16వ తేదీ వరకు నామినేషన్ల ఉప సంహరణకు గడువు ఉంది. ఇప్పటికే వైసీపీ తమ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణను ప్రకటించగా.. కూటమి ఇంకా ప్రకటించలేదు.
Translate this News: