BREAKING: జగన్ సంచలన నిర్ణయం.. ఎమ్మెల్సీ బరిలో బొత్స!

వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరును ఖరారు చేశారు. బొత్స పోటీతో తమ విజయం ఈజీ అవుతుందని.. తద్వారా కుటమికి తొలి షాక్ ఇవ్వాలన్నది జగన్ వ్యూహంగా తెలుస్తోంది.

New Update
BREAKING: జగన్ సంచలన నిర్ణయం.. ఎమ్మెల్సీ బరిలో బొత్స!

JAGAN: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను పోటీలోకి దించనున్నట్లు ప్రకటించారు. టికెట్ ఎవరికి కేటాయించాలన్న అంశంపై ముఖ్య నేతల నుంచి అభిప్రాయాలు తీసుకున్న అనంతరం జగన్ బొత్స పేరును ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఆగస్టు 30న ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనుంది. ఆగస్టు 13 వరకు నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఎక్స్ ఆఫిషియో మెంబర్లతో కలిసి మొత్తం ఓట్లు 841 ఉన్నాయి. వైసీపీకి 615, టీడీపీకి 215 ఓట్లు ఉండగా.. 11 ఖాళీలు ఉన్నాయి. గతంలో ఇక్కడి నుంచి వైసీపీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికైన వంశీకృష్ణయాదవ్ ఎన్నికల ముందు జనసేనలో చేరారు. వైసీపీ ఫిర్యాదుతో ఆ వెంటనే అతనిపై మండలి చైర్మన్ అనర్హత వేటు వేశారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నికకు ఈసీ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఇదే ఎమ్మెల్సీ స్థానంలో పోటీకి వైసీపీ నుంచి మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాల నాయుడు, అలాగే ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన బొత్స సత్యనారాయణ సతీమణి ఝాన్సీ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, ఈరోజు జగన్ స్థానిక నాయకులతో సమావేశమై వారి అభిప్రాయాలను సేకరించారు. అనంతరం బొత్స సత్యనారాయణ పేరును ఫైనల్ చేశారు. ఉత్తరాంధ్రలో బలమైన నాయకుడిగా ఉన్న బొత్స సత్యనారాయణను పోటీలోకి దింపడం వల్ల ఇక్కడ ఈజీగా గెలవచ్చని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు కూటమి కూడా ఆ ఎమ్మెల్సీ స్థానానికి గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోంది. బొత్స సత్యనారాయణను ధీటైన నాయకుడిని బరిలోకి దింపి.. ఆ ఎమ్మెల్సీ స్థానంలో పసుపు జెండా ఎగురవేయాలని టీడీపీ భావిస్తోంది. అయితే.. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ పోటీ చేయనున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Also Read : జూన్‌లో నోటిఫికేషన్లు, డిసెంబర్‌లోగా నియామకాలు.. తెలంగాణ జాబ్ క్యాలెండర్ ఇలా!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు