రూ.2వేల కోసం లోన్‌యాప్ వేధింపులు.. కొత్త పెళ్లి కొడుకు ఆత్మహత్య

లోన్ యాప్‌ ఏజెంట్ల వేధింపుల కారణంగా మరో యువకుడు బలయ్యాడు. విశాఖపట్టణానికి చెందిన 21ఏళ్ల నరేంద్ర తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్యహత్య చేసుకున్నాడు. రూ.2 వేలు పెండింగ్ బిల్లు చెల్లించకపోవడంతో వేధించారు. కాగా అతడికి 40 రోజుల క్రితమే పెళ్లైంది.

New Update
AP: టీడీపీ నేత దారుణ హత్య.. వేట కొడవళ్ళు, కత్తులతో పొడిచి..

ఈ మధ్య కాలంలో లోన్‌యాప్ వేధింపుల కారణంగా ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. చిన్న చిన్న మొత్తానికే పదేపదే వేధించడం వల్ల యువతి, యువకులు మనస్థాపంతో ప్రాణాలు విడిచారు. ఇచ్చిన డబ్బులు చెల్లించినా.. ఇంకా కట్టాలంటూ వేధిస్తున్నారు. కట్టకపోతే ఫొటోలు మార్ఫింగ్ చేసి బెదిరించడం చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు, బంధువులకు మార్ఫింగ్ చేసిన ఫొటోలు పంపించడంతో కొందరు మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారు.

ఇది కూడా చూడండి: అలా చేస్తే కఠిన చర్యలు.. రాష్ట్ర సర్కార్ హెచ్చరిక!

ఇలాంటి ఘటనే తాజాగా మరొకటి జరిగింది. కేవలం రూ.2 వేల కోసం కొత్తగా పెళ్లైన ఓ యువకుడిని లోన్ యాప్ సిబ్బంది వేధించింది. తన భార్యతో ఉన్న ఫొటోలు మార్ఫింగ్ చేసి కుటుంబ సభ్యులకు, బంధువులకు పంపించింది. దీంతో తన పరువు పోయిందని భావించిన ఆ యువకుడు తీవ్ర మనస్థాపంతో ఇవాళ (మంగళవారం) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఇది కూడా చూడండి:  బట్టలు ఆరేస్తుండగా.. విద్యుత్ షాక్‌తో ముగ్గురు మృతి

రూ.2వేల కోసం వేధింపులు

ఏపీలోని విశాఖపట్టణం జిల్లా అంగడి దిబ్బకు చెందిన నరేంద్ర (21)కు 40 రోజుల కిందట పెళ్లైంది. కొత్త జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న నరేంద్ర.. తన వ్యక్తిగత ఖర్చుల కోసం ఓ ప్రైవేట్ యాప్‌లో అప్పు తీసుకున్నాడు. ఇక తీసుకున్న అప్పును విడతల వారీగా చెల్లిస్తూ వస్తున్నాడు. ఇంకా రూ.2 వేలు లోన్ అమౌంట్ మాత్రమే పెండింగ్‌లో ఉంది.

ఇది కూడా చూడండి: ముంబైలో ఘోర ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం 

ఆ రెండు వేల రూపాయలను అతి త్వరలోనే చెల్లిస్తానని చెప్పినా.. లోన్ యాప్ ఏజెంట్లు వినలేదు. తరచూ నరేంద్రను వేధించడం మొదలు పెట్టారు. ఇందులో భాగంగానే నరేంద్రను బెదిరించడం ప్రారంభించారు. అక్కడితో ఆగని లోన్ యాప్ ఏజెంట్లు మరో అడుగు ముందుకేసి దారుణానికి ఒడిగట్టారు. కొత్తగా పెళ్లైన నరేంద్ర, అతడి భార్య ఫొటోలను మార్ఫింగ్ చేశారు.

Also Read: 'పుష్ప2' జేసీబీ కంటే తోపేమి కాదు.. బన్నీ గాలి తీసేసిన సిద్దార్థ్!

ఆపై నరేంద్ర కుటుంబ సభ్యులకు, బంధువులకు పంపంచారు. దీంతో పరువుపోయిందని భావించిన నరేంద్ర ఇవాళ (మంగళవారం) తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నరేంద్ర మృతితో కట్టుకున్న భార్య, కనీ పెంచిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు