/rtv/media/media_files/2025/07/31/wife-pours-boiled-water-on-husband-while-sleeping-2025-07-31-17-25-00.jpg)
wife pours boiled water on husband while sleeping
AP Crime: ఈ మధ్య కాలంలో భార్యలు తమ భర్తలను హత్య చేస్తున్న ఘటనలు దేశంలో విపరీతంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా అక్రమ సంబంధాల కారణంగానే ఈ హత్యలు ఎక్కువగా జరుగుతండటంతో చాలా మంది ఆందోళన చెందుతున్నారు. భార్యలు తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి భర్తలను చంపడానికి ప్లాన్ చేస్తున్న కేసులు రోజు రోజుకూ బయటపడుతున్నాయి.
Also Read:బడా మోసం.. హీరో ‘పవర్‌స్టార్’ను అరెస్టు చేసిన పోలీసులు
అందులోనూ భర్తను చంపడానికి ప్రియుడి సహాయం తీసుకోవడం లేదా తానే ధైర్యం తెచ్చుకుని నేరుగా భర్తను హత్య చేయడం జరుగుతుంది. ఇదంతా ఒకెత్తయితే దీర్ఘకాలంగా కొనసాగుతున్న కుటుంబ తగాదాలు, మానసిక వేధింపులు, ఆర్థిక సమస్యలతో పాటు ఇతర మానసిక ఒత్తిళ్లు కూడా హత్యలకు దారితీస్తున్నాయి. కొన్నిసార్లు భర్త మద్యపానం, వేధింపులు కూడా భార్యను తీవ్రమైన చర్యలకు దారితీసేలా చేస్తుంది. ఇలా సమాజంలో భర్తలపై భార్యలు చేసే ఈ దాడులు, హత్యలు సమాజంలో తీవ్ర చర్చలకు దారి తీస్తున్నాయి.
భర్తపై భార్య దారుణం
ఈ నేపథ్యంలోనే మరో షాకింగ్ ఇన్సిడెంట్ చోటుచేసుకుంది. ఏపీలోని వైజాగ్‌లో ఓ భార్య కోపంతో రగిలిపోయింది. భర్తతో గొడవపడి ఆగ్రహానికి గురైంది. దీంతో పడుకున్న భర్తపై వేడి నీళ్లు పోసింది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం పరిధి నేరెళ్లవలసలో ఈ దారుణం జరిగింది. నందిక కృష్ణ, గౌతమి ఆరేళ్ల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. అయితే ఈ మధ్య కాలంలో వీరిమధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. చిన్న చిన్న విషయాలకి భార్య భర్తలిద్దరూ గొడవ పడటం మొదలెట్టారు. ఈ క్రమంలోనే భార్య గౌతమి బుధవారం రాత్రి 2 గంటల సమయంలో పడుకున్న భర్త కృష్ణపై వేడినీళ్లు పోసింది. ప్రమాదవశాత్తు అతడికి గాయాలు మాత్రమే కావడంతో వెంటనే విశాఖ కేజీహెచ్‌కి తరలించారు. ప్రస్తుతం బాదితుడు కృష్ణకు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Also Read:‘కింగ్డమ్’ మూవీ హిట్టా? ఫట్టా?.. అదిరిపోయిన రివ్యూ
కాగా ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. అందులో ఇటీవల ఢిల్లీకి చెందిన 36 ఏళ్ల వ్యక్తి కరెంట్ షాక్‌తో మృతి చెందాడు. అయితే మొదటి అందరూ ఇది సాధారణ మరణంగానే భావించారు. కానీ అతని భార్య, అతని కజిన్ మధ్య జరిగిన చాట్ ఆధారంగా అది హత్య అని తేలింది. అక్రమ సంబంధం కారణంగానే భర్తకు మత్తు ఇచ్చి, విద్యుదాఘాతంతో చంపడానికి ప్లాన్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇలాంటిదే మరొకటి మేఘాలయలో హనీమూన్ కేసు. ఈ కేసులో భర్త రాజా రఘువంశీని అతని భార్య సోనమ్ తన ప్రియుడితో కలిసి హత్య చేయించినట్లు పోలీసులు గుర్తించారు. ఆమె ప్రియుడితో ఉన్న అక్రమ సంబంధమే ఈ హత్యకు కారణమని తేలింది.