వరద నష్టం అంచనాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
ఏపీలో దాదాపు అన్ని ప్రాంతాలు వరదలతో మునిగిపోయాయి. విజయవాడ సంగతి చెప్పనే అక్కర్లేదు. ఈనే పథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు వరద నష్టం అంచనాల మీద సమీక్ష జరిపారు. ఎన్యూమరేషన్ ఎంత మేర జరిగిందన్న అంశంపై సీఎం ఆరా తీశారు.
ఏపీలో దాదాపు అన్ని ప్రాంతాలు వరదలతో మునిగిపోయాయి. విజయవాడ సంగతి చెప్పనే అక్కర్లేదు. ఈనే పథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు వరద నష్టం అంచనాల మీద సమీక్ష జరిపారు. ఎన్యూమరేషన్ ఎంత మేర జరిగిందన్న అంశంపై సీఎం ఆరా తీశారు.
బుడమేరు వరదల్లో విజయవాడలో సర్వం కోల్పోయిన వారి పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. వారిని సాధారణ పరిస్థితికి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. పాడైన ఎలక్ట్రిక్ వస్తువులను అర్బన్ కంపెనీ యాప్ తో ఇంటివద్దనే మరమత్తులు జరిపించే ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం
విజయవాడ అజిత్ సింగ్ నగర్ లో ఆహారం,నీళ్లు అందడం లేదని వీఆర్వో విజయలక్ష్మిని వరద బాధితులు నిలదీశారు. దీంతో వారి మధ్య వాగ్వాదం నెలకొనగా..సహనం కోల్పోయిన వీఆర్వో యాసిన్ అనే బాధితుడి పై చేయి చేసుకున్నారు. ఈ విషయం కలెక్టర్ కి తెలియడంతో ఆమెను సస్పెండ్ చేశారు.
ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న 67,69,70 గేట్ల కౌంటర్ వెయిట్ల రిపేర్లు పూర్తయ్యాయి. జలవనరుల శాఖ సలహాదారు కన్నయ్య నాయుడు నేతృత్వంలో కేవలం 5 రోజుల్లోనే 3 గేట్ల వద్ద భారీ కౌంటర్ వెయిట్లు ఏర్పాటు చేయడం పూర్తి చేశారు.
బుడమేరులో గల్లంతైన వ్యక్తి డెడ్‌బాడీ లభ్యమయింది. ఇవాళ మధ్యాహ్నం మృతదేహాన్ని NDRF సిబ్బంది గుర్తించారు. గన్నవరం మండలం కేసరపల్లి దగ్గర కొట్టుకుపోయిన ఫణికృష్ణ.. పడిన ప్రదేశానికి దగ్గరలోనే మృతదేహం ఉంది. అయితే ఫణికృష్ణ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో ఏ క్షణంలోనైనా బుడమేరుకు ఆకస్మిక వరదలు రావొచ్చని విజయవాడ నీటిపారుదల విభాగం ఎస్ఈ ఆదివారం అర్ధరాత్రి తెలిపారు.ఇప్పటికే నీటిమట్టం ఓ అడుగు పెరిగిందని తెలిపారు.
ఏపీలో భారీ వర్షాల నేపథ్యంలో చంద్రబాబు సర్కార్ సోమవారం పలు జిల్లాల పాఠశాలలకు సెలవు ప్రకటించింది. పునరావాస కేంద్రాలు, ముంపు ప్రాంతాల్లో స్కూల్స్ బందు చేస్తున్నట్లు విద్యాశాఖ అధికారి స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. చట్టం అమల్లోకి రాగానే మొట్ట మొదటగా బుడమేరు ఆక్రమణలే తొలగిస్తామని చెప్పారు. కొంతమంది ఆక్రమణల కారణంగా లక్షల మంది ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు.
ప్రకాశం బ్యారేజ్‌కు వరద ప్రవాహం భారీగా పెరుగుతోంది. దీంతో కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తోంది. 70 గేట్లు పూర్తిగా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. స్థానిక ప్రజలకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు.