Prabhas : వరద భాదితులకు ప్రభాస్ భారీ విరాళం
తెలుగు రాష్ట్రాల్లో వరదల నేపథ్యంలో టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రెండు రాష్ట్రాలకు కలిపి రెండు కోట్లను విరాళంగా ప్రకటించారు. అంతేకాకుండా వరద బాధితులకు మంచినీరు, ఆహారం కూడా ఏర్పాటు చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో వరదల నేపథ్యంలో టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రెండు రాష్ట్రాలకు కలిపి రెండు కోట్లను విరాళంగా ప్రకటించారు. అంతేకాకుండా వరద బాధితులకు మంచినీరు, ఆహారం కూడా ఏర్పాటు చేశారు.
సింగ్ నగర్, నున్న పరిసర ప్రాంతాలతో పాటు ఇబ్రహీం పట్నం ఏరియాలలోని నీట మునిగిన ప్రాంతాలను సీపీ రాజశేఖర్ బాబు పరిశీలించారు. ఈ క్రమంలో వరదలో చిక్కుకున్న 10నెలల బాలికను.. వారి కుటుంబ సభ్యులను బోట్ సహాయంతో సీపీ బయటకు తీసుకువచ్చారు.
ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా తలెత్తిన వరద విపత్తు సహాయక చర్యల నిమిత్తం ప్రభుత్వాలకు చిరంజీవి కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు 50 లక్షల రూపాయలు, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు మరో 50 లక్షలు చిరు ప్రకటించారు.
తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ మరో కీలక ప్రకటన చేసింది. ఈ నెల 5న పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంను ఆనుకొని మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది.ఈ క్రమంలో రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపింది.
వరద ప్రాంతాల్లో బాధితుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఎక్కడికక్కడ వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. బాధితులు ఆందోళన చెంద వద్దని ఆయన అన్నారు. దీంతో పాటూ మరోసారి బుడమేరు ముంపు రాకుండా చర్యలు తీసుకుంటామని బాబు చెప్పారు.
ప్రజలను వరదల్లో ముంచేసి ఏపీ మంత్రులంతా విహార యాత్రలకు వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారని మాజీ మంత్రి రోజా అన్నారు. విజయవాడలో ప్రజల కష్టాలను చూసి గుండె తరుక్కుపోతుందంటూ ఎమోషనల్ అయ్యారు. ఇంత మంది ప్రాణాలు పోవడానికి కూటమి ప్రభుత్వ వైఫల్యమే కారణమన్నారు.
ముంబై నటి కాదంబరి జెత్వానీ ఇష్యూలో మాజీ సీఎం జగన్ ప్రమేయం ఉందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. జెత్వానీ నోరు మూయించడానికి సజ్జన్ జిందాల్, జగన్ ప్లాన్ చేశారని ఆరోపించారు. ఇద్దరు కూతుళ్లున్న జగన్ ఆమె విషయం ఎందుకు ఆలోచించలేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
వరద ప్రభావానికి విజయవాడ అతలాకుతలమైంది. నున్న ప్రాంతం సమీపంలో టాటా కార్ల షోరూం నీట మునిగింది. షోరూం గ్రౌండ్లో దాదాపు 300 కొత్త కార్లు పార్కు చేయగా.. వరద ప్రభావానికి అవి మునిగిపోయాయి.రూ.కోట్లల్లో నష్టం జరిగిందని షోరుం సిబ్బంది వాపోయారు.
వరద బాధితుల సహాయక చర్యల్లో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఏమాత్రం సహించేది లేదని.. కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హెచ్చరించారు. బాధితులకు మూడు పూటలా ఆహారం అందించాలని ఆదేశించినట్లు చెప్పారు. చిట్ట చివరి బాధితుడికి కూడా సాయం అందాలని స్పష్టం చేశారు.