Vijayawada: బుడమేరుకు మళ్లీ వరదలు…వార్నింగ్ ఇచ్చిన కలెక్టర్! బుడమేరుకు మళ్లీ గండ్లు పడ్డాయని, మళ్లీ వరద వస్తోందని రుమార్స్ వస్తుండడంతో కలెక్టర్ సృజన స్పందించారు. బుడమేరుకు గండ్లు పడ్డాయన్న వదంతులు నమ్మవద్దని స్పష్టం చేశారు. బుడమేరుకు ఎలాంటి వరద నీరు రాలేదని ఆమె వివరించారు. By Bhavana 15 Sep 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి Vijayawada: ఇటీవల కురిసిన వర్షాల వల్ల బుడమేరుకు గండ్లు పడి విజయవాడ నగరాన్ని వరద నీరు ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం రంగం మొత్తం తీవ్రగా కష్టపడి విజయవాడను సాధారణ పరిస్థితులకు తీసుకుని వచ్చింది. బుడమేరుకు మళ్లీ గండ్లు పడ్డాయని, మళ్లీ వరద వస్తోందని రుమార్స్ బయల్దేరాయి. దీనిపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన స్పందించారు. బుడమేరుకు గండ్లు పడ్డాయన్న వదంతులు నమ్మవద్దని స్పష్టం చేశారు. బుడమేరుకు ఎలాంటి వరద నీరు రాలేదని ఆమె వివరించారు. బుడమేరుకు మళ్లీ వరద అంటూ కొందరు ఆకతాయిలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని కలెక్టర్ సృజన తెలిపారు. ఇలాంటి వదంతులు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిజం లేదని… బుడమేరుకు మళ్లీ వరద వస్తోందని, విజయవాడలోని అజిత్ సింగ్ నగర్, తదితర ప్రాంతాలు మళ్లీ నీట మునుగుతాయని జరుగుతోన్న ప్రచారంపై రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ స్పందించారు. మళ్లీ బుడమేరుకు వరద వస్తుందని జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని మంత్రి తెలిపారు. కొత్త రాజేశ్వరిపేట, జక్కంపూడి కాలనీల్లో ఎలాంటి వరద నీరు రాలేదని ఆయన పేర్కొన్నారు. బుడమేరు కట్ట మళ్లీ తెగిందనేది తప్పుడు ప్రచారమని, ప్రజలు ఆందోళనకు గురికావాల్సిన అవసరంలేదని నారాయణ పేర్కొన్నారు. Also Read: పోర్ట్ బ్లెయిర్ పేరు మార్పుపై ఏపీ డిప్యూటీ సీఎం ఏమన్నారంటే! మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి