Stock Market:మూరత్ ట్రేడింగ్‌లో అదరగొట్టిన సూచీలు..లాభాలతో కొత్త సంవత్ దీపావళి సంద్భంగా నిర్వహించే మూరత్ ట్రేడింగ్ అద్భుతంగా మొదలైంది. సెన్సెక్స్ 335 పాయింట్ల లాభంతో 79,724 వద్ద ముగిసింది. అదే సమయంలో, నిఫ్టీ 99 పాయింట్లు జంప్ చేసి 24,304 వద్ద ముగిసింది. By Manogna alamuru 01 Nov 2024 in బిజినెస్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Muhurath Trading: దీపావళి సందర్భంగా భారతీయ స్టాక్ మార్కెట్‌లో ముహూర్తపు ట్రేడింగ్ సంప్రదాయం ఉంది. దీన్ని ప్రతీ ఏడాది నిర్వహిస్తారు. అయితే సాధారణంగా మూరత్ ట్రేడింగ్‌ను దీపావళి రోజున నిర్వహిస్తారు. కానీ ఈ ఏడు మాత్రం పండుగ మర్నాడు నంబర్ 1న అంటే ఈరోజున నిర్వహించారు. సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు వరకు ఒక గంట ఇది జరిగింది. ఈ గంటలో సూచీలు అదరగొట్టాయి. అన్ని రంగాల షేర్లూ లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా ఆటో మొబైల్ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దుతు కనిపించింది.సెన్సెక్స్ 335 పాయింట్ల లాభంతో 79,724 వద్ద ముగిసింది. అదే సమయంలో, నిఫ్టీ 99 పాయింట్లు జంప్ చేసి 24,304 వద్ద ముగిసింది. దీంతో రెండు రోజుల సూచీల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. కొత్త సంవత్ లాభాలతో మొదలైంది. Also Read:IPL 2025:కేఎల్ రాహుల్ రిలీజ్..ఓనర్ సంజీవ్ గోయెంకా అనుచిత వ్యాఖ్యలు మూరత్ ట్రేడింగ్‌లో మొత్తం 30 సెన్సెక్స్ స్టాక్స్‌లో 26 లాభపడగా, 4 నష్టపోయాయి. అదే సమయంలో, 50 నిఫ్టీ స్టాక్‌లలో 42 పెరుగుదల కనిపించింది. నిఫ్టీ ఐటీ మినహా, ఎన్‌ఎస్‌ఈలోని అన్ని రంగాల్లో పెరుగుదల కనిపించింది. ఐటీ రంగంలో స్వల్పంగా 0.2 శాతం క్షీణించింది. అదే సమయంలో, నిఫ్టీ ఆటోలో 1.29%, ఆయిల్ & గ్యాస్‌లో 0.99%, కన్స్యూమర్ డ్యూరబుల్స్‌లో 0.90% సహా నిఫ్టీ రియల్టీ, మెటల్ ఫార్మాలో పెరుగుదల ఉంది. ఇక గత ఏడాది ముహూర్త ట్రేడింగ్ సెషన్‌లో, సెన్సెక్స్ 354.77 పాయింట్ల లాభంతో 65,259.45 దగ్గర ముగిసింది. నిఫ్టీ కూడా 100.20 పాయింట్లు పెరిగి 19,525.55 దగ్గర క్లోజ్ అయింది. 2019 నుండి 2023 వరకు స్టాక్ మార్కెట్ ప్రతిసారీ లాభాలతో ముగిసింది. సెన్సెక్స్ 2022లో 525 పాయింట్లు, 2021లో 295 పాయింట్లు, 2020లో 195 పాయింట్లు, 2019లో 192 పాయింట్ల వృద్ధితో ముగిసింది. Also Read: రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలోకి నార్త్ కొరియా బలగాలు–ధృవీకరించిన అమెరికా మూరత్ ట్రేడింగ్ అంటే ఏంటి? మ సంప్రదాయం ప్రకారం ఒక్కో దానికి ఒక్కోలా ఏడాది మొదలవుతుంది. అంటే తెలుగు వారికి ఉగాదితో కొత్త సంవత్సరం మొదలవుతుంది. ప్రపంచమంతటికీ జనవరి 1న, ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ఎలా మొదలవుతాయో...ఇండియన్ స్టాక్ మార్కెట్ కు కొత్త సంవత్సరం దీపావళితో ప్రారంభం అవుతుంది. ఈ సంప్రదాయాన్ని దాదాపు 68 ఏళ్ళుగా పాటిస్తున్నారు. దీపావళి రోజు లక్ష్మీ దేవిని పూజిస్తారు. దీపావళి రోజున ఏదైనా పని ప్రారంభిస్తే విజయం వరిస్తుందన్నది భారతీయుల విశ్వాసం. అందుకే ఇదే రోజును స్టాక్ మార్కెట్ ప్రారంభం రోజుగా ఎన్నుకొన్నారు. ఈరోజున ప్రారంభిస్తే మార్కెట్లో లాభాల పంట పడుతుందని నమ్మకం. ఇక ఈరోజు నుంచి సంవత్ 2081 మొదలైంది. దీపావళి రోజున చాలా మంది ట్రేడింగ్‌లో పాల్గొంటారు. ఇప్పటికే పెట్టుబడులు పెడుతున్న వారికీ, కొత్తగా మార్కెట్లోకి రావాలనుకునే వారికీ ఇది ఎంతో ప్రత్యేకం. Also Read: National: ఈసీకి స్వతంత్రత లేదు–కాంగ్రెస్ లేఖ Also Read: సమీపిస్తున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు.. ఎంతమంది బరిలో ఉన్నారంటే మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి