Pawan Kalyan Speech At Palle Pandaga: ఈరోజు నుంచి వారం రోజలు పాటూ ఆంధ్రాలో పల్లె పండగ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కృష్ణా జిల్లా కంకిపాడు సంబరాల్లో పాల్గొన్నారు. అక్కడ సభలో ఆయన మాట్లాడారు. ఇందులో సినిమాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్‌లో నేను ఎవ్వరితోనూ పోటీ పడటం లేదంటూ..అల్లు అర్జున్‌కు (Allu Arjun) ఇండైరెక్ట్‌గా కౌంటర్లు వేశారు. హీరోలు ఎవరైనా బాగుండాలనే కోరుకుంటానని అన్నారు. కానీ సినిమా ఇండస్ట్రీ బాగుండాలి అంటే...ముందు రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ బాగుడలి. రాషట్రాన్ని బాగు చేసుకుని ఆ తరువాత విందులు, వినదాలు చేసుకుందాం అని అన్నారు పవన్ కల్యాణ్.
Also Read: ఎన్నికల వేళ షిండే సర్కార్ సంచలన నిర్ణయం.. ఇక నుంచి నో టోల్ ఫీజు!
ముందు అభివృద్ధి..తరువాతే విందులూ–వినోదాలూ..
సినిమాలకు వెళ్ళాలంటే టికెట్లకు డబ్బులు పెట్టాలి. అంటే అందరి చేతిలో డబ్బులు ఉండాలి. అలా ఉండాలి అంటే ముందు కడుపు నిండాలి. అందుకే ముందు ఆపని చేద్దాం అంటూ పవన్ వ్యాఖ్యలు చేశారు. తనకు ఏ హీరోతోనూ ఇబ్బంది లేదని..తాను అందరూ బాగుండాలనే కోరుకుంటాని చెప్పారు. ఒక్కొక్కరూ ఒక్కో దాంట్లో నిష్ణాతులు. బాలకృష్ణ, చిరంజీవి, మహేశ్‌బాబు, తారక్, అల్లు అర్జున్, రామ్‌చరణ్, నాని అందరూ బాగుండాలి. కానీ నాకు ఇప్పుడు అన్నిటికంటే రాష్ట్రాభివృద్ధే ముఖ్యం అన్నారు డిప్యూటీ సీఎం. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాఉండాలి..ముందు దానిపై దృష్టి పెడదాం అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.
Also Read: TS: రేవంత్ సర్కార్ కు హైకోర్టు బిగ్ షాక్.. మూసీ కూల్చివేతలపై స్టే!
అందరి బాగు కోసమే..
గ్రామీణ కుటుంబాలకు కనీసం 100 రోజుల పని కల్పించేందుకు ప్రభుత్వం సంకల్పించిందని..అందరి జీవితాల మెరుగుపడేలా కృషి చేస్తామని అన్నారు పవన్. రాష్ట్రవ్యాప్తంగా సిమెంట్ రోడ్లు, బీటీ రోడ్లు, కాంపౌండ్ వాల్స్, పాఠశాలల్లో రూఫ్ టాప్స్, గోకులం నిర్మాణాలు, తాగునీటిఎద్దడి ఉన్న ప్రాంతాల్లో సమస్యను తీర్చడం, పారిశుద్ధ్య పనులు, ఇతర 30వేల అభివృద్ధి పనులు చేపట్టేందుకు పల్లె పండుగ వారోత్సవాల్లో శంకుస్థాపన చేస్తామని.. సంక్రాంతి లోపు అన్ని పనులూ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. మొత్తం 4500 కోట్లతో 30వేల పనులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పారు.
Also Read: వ్యక్తి ఖాతాలోకి పొరపాటున రూ.16 లక్షలు.. చివరికి ఊహించని షాక్
Also Read: డెంగ్యూ వ్యాప్తి వేగంగా పెరుగుతోంది.. మీ పిల్లలను ఇలా కాపాడుకోండి..?