ఏపీలో డ్రగ్స్ , గంజాయిల మీద తీవ్ర చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా యాంటీ నార్కోటిక్ టీమ్‌ను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. దీనిపై ఇవాళ ఏపీ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ పేరును ‘ఈగల్’(Eagle)గా మార్చడంపై ఈ మీటింగ్‌లో చర్చించినట్టు తెలుస్తోంది. ఈగల్ టాస్క్ ఫోర్స్ విధివిధానాలతో పాటు కీలక నిర్ణయాల దిశగా సబ్ కమిటీ సమాలోచనలు జరిపింది. మంత్రులు లోకేశ్, సత్యకుమార్, కొల్లు రవీంద్ర, సంధ్యారాణి భేటీలో ఉన్నారు.
డ్రగ్స్ పై ఉక్కు పాదం..
సమావేశం తర్వాత హోం మంత్రి అనిత మీడియాతో మాట్లాడారు. ఇందులో ఆమె ఈగల్ పేరుతో యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి జిల్లాలో నార్కోటిక్స్ కంట్రోల్ సెల్, నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని హోంమంత్రి చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులమీదుగా ఈగల్ 1972 టోల్ ఫ్రీ నంబర్‌ను ఆవిష్కరిస్తామని తెలిపారు. జాయింట్ టాస్క్ ఫోర్స్ ద్వారా గంజాయి రవాణాపై నిఘా పెడతామని.. గంజాయి సాగు, సరఫరాపై ఉక్కుపాదం మోపుతామని హోంమంత్రి హెచ్చరించారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ ఆనవాళ్లు లేకుండా చేస్తామన్నారు. ప్రజలను చైతన్యపరచి డ్రగ్స్ వాడకాన్ని నిరోధిస్తామని మంత్రి అన్నారు. వచ్చే 6 నెలల్లో రాష్ట్రంలో గంజాయి వినియోగం లేకుండా చేసే దిశగా అన్ని మార్గాలపైనా దృష్టిసారిస్తామని చెప్పారు.
Also Read: Pawan kalyan: బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ పూజారి అరెస్టుపై స్పందించిన పవన్
Also Read: కేవలం రూ.48 చెల్లిస్తే.. నెలంతా అన్ లిమిటెడ్ జర్నీ.. TSRTC బంపరాఫర్!