Pawan kalyan: బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ పూజారి అరెస్టుపై స్పందించిన పవన్‌

బంగ్లాదేశ్‌లో చిన్మోయ్‌ కృష్ణదాస్‌ అరెస్టును డప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ఖండించారు. ఈ అంశంపై హిందువులందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. 

author-image
By Manogna alamuru
New Update

హిందువులపై దాడులు ఆపాలని బంగ్లాదేశ్  ప్రభుత్వాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్ ఏర్పాటు కోసం భారత సైన్యం రక్తం చిందించింది...కానీ అదే ప్రభుత్వం ఇప్పుడు హిందువులపై దాడి చేస్తోందని ఆరోపించారు. ఇస్కాన్ గురువు చిన్మోయ్ కృష్ణదాస్ ను అరెస్ట్ చేయడం ఎంత మాత్రం సబబు కాదని పవన్ అన్నారు. ఈ అంశంపై హిందువులందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్‌ ఏర్పాటు కోసం భారత వనరులు ఖర్చు చేశాం..కానీ ఇవాళ బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు నన్ను కలచివేస్తున్నాయని అన్నారు. ప్రపంచం మొత్తం పాలస్తీనా గురించి స్పందిస్తోంది..కానీ బంగ్లాదేశ్‌లో హిందువుల గురించి ఆలోచించడం లేదని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.

 

మరింత అల్లర్లు చెలరేగుతాయి..

బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ సభ్యుడు చిన్మోయ్ కృష్ణ దాస్‌ అరెస్ట్ అయిన విషయం తెలిసన వెంటనే భారత ప్రభుత్వం స్పందించింది. దీనిపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ  ప్రకటన విడుదల చేసింది. బంగ్లాదేశ్‌లో చిన్మోయ్ కృష్ణ దాస్‌ను అరెస్టు చేయడం, బెయిల్ నిరాకరించడంపై మేం ఆందోళన చెందుతున్నాం. ఇప్పటికే బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనారిటీలపై తీవ్రవాద మూకలు దాడి చేస్తున్నాయి. ఇస్కాన్ గురు అరెస్ట్‌తో ఇవి మరింత పెరిగే అవకాశం ఉంది. మైనారిటీల గృహాలు, వ్యాపార సంస్థలను కాల్చడం, దోచుకోవడం, అలాగే దొంగతనం, విధ్వంసం, దేవాలయాలను అపవిత్రం చేయడం వంటి అనేక కేసులు ఉన్నాయి అని విదేశాంగ శాఖ చెప్పింది.

Also Read: AP: విజయ్‌ పాల్‌కు 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు..

Advertisment
Advertisment
తాజా కథనాలు