AP లిక్కర్ స్కామ్‌లో సంచలన వీడియో.. కుప్పలు కుప్పలుగా నోట్ల కట్టలు

ఏపీ లిక్కర్ స్కామ్‌లో సిట్ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. సిట్ అధికారులు కీలక వీడియో సేకరించారు. ఈ కేసులో A-34గా ఉన్న వెంకటేష్ నాయుడు ఫోన్ దర్యాప్తు అధికారులకు చిక్కింది. అందులో వెంకటేష్ నాయుడు నోట్ల కట్టలు లెక్కబెడుతూ ఉన్నాడు.

New Update

ఏపీ లిక్కర్ స్కామ్‌లో సిట్ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌ శివారులోని సులోచన ఫాంహౌస్‌లో తనికీలు చేశారు. లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చిన రూ.11 కోట్లు అక్కడ ఉన్నాయి. ఇదిలా ఉంటే లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారులు కీలక వీడియో సేకరించారు. 

ఈ కేసులో A-34గా ఉన్న వెంకటేష్ నాయుడు ఫోన్ దర్యాప్తు అధికారులకు చిక్కింది. అందులో వెంకటేష్ నాయుడు నోట్ల కట్టలు లెక్కబెడుతూ ఉన్నాడు. టేబుల్ పైన కుప్పలు కుప్పలుగా కరెన్సీ నోట్ల కట్టలు ఉన్నాయి. వీడియోలో వెంకటేష్ నాయుడు డబ్బులు లెక్కిస్తున్నారు. ఆ వీడియోని పోలీసులు విడుదల చేశారు. అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అతని ఫోన్‌లో వీడియో ఉంది. ఇప్పటికే లిక్కర్ కేసులో వెంకటేష్ నాయుడు అరెస్ట్ అయ్యారు.

Advertisment
తాజా కథనాలు