Hindupuram : ఎవరో హైదరాబాద్‌లో ఉండేవాడి కాళ్లకింద బతుకుతున్నాం..వైసీపీ నేత వ్యాఖ్యలు.. భగ్గుమన్న టీడీపీ

ఏపీ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. తాజాగా..నందమూరి బాలకృష్ణ నియోజక వర్గం హిందూపురంలో వైఎస్సార్సీపీ పార్టీ ఆఫీస్ పై దాడి ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బాలకృష్ణ అభిమానులు, టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యాలయంపై దాడిచేసి ఫర్నీచర్ ను ధ్వంసంచేశారు.

New Update
FotoJet - 2025-11-15T173817.521

The violent attack by TDP leaders and Balakrishna’s followers on the YSRCP office in Hindupur

Hindupuram  : ఏపీ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. ఇప్పటికే సీఎం చంద్రబాబుపాలపై.. వైఎస్ జగన్ అవకాశం దొరికినప్పుడల్లా విమర్శిస్తున్నారు. మరోవైపు కూటమి  ప్రభుత్వం కూడా వైసీపీకి కౌంటర్లు ఇస్తుంది. ఈ క్రమంలో తాజాగా.. ఏపీలోని నందమూరీ బాలకృష్ణ నియోజక వర్గం హిందూపురంలో వైఎస్సార్సీపీ పార్టీ ఆఫీస్ పై దాడి ఘటన ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కొంత మంది బాలకృష్ణ అభిమానులు, టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యాలయంలోకి ప్రవేశించి ఫర్నీచర్ ను పూర్తిగా ధ్వంసంచేశారు.మూకుమ్మడిగా కొంత మంది వైసీపీ పార్టీ ఆఫీసులో ప్రవేశించి దాడులు చేస్తున్న ఘటన అక్కడి సీసీ టీవీల్లో కూడా రికార్డు అయ్యాయి. ఈ ఘటనతో హిందుపూరంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

అసలేం జరిగిందంటే..

 హిందూపురం వైసీపీ ఇంచార్జ్ దీపికా రెడ్డి భర్త  వేణురెడ్డి బాలకృష్ణపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఈ దాడి జరిగింది.  "ఎవరో  హైదరాబాద్ లో ఉండే వాడి కాళ్ల కింద బతుకుతున్నాం.. వారికి ఓట్లు వేస్తాం, వారు హైదారబాద్‌లో  కూర్చుంటాడు. మనం ఇక్కడ బానిస బతుకులు బతుకుతున్నాం'... అని ఆయన వ్యాఖ్యానించారు. వేణురెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేసి. కార్యాలయంపై దాడి చేశారు. వేణు రెడ్డి భార్య  దీపికారెడ్డి గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

ఈ ఘటనపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఎక్స్  వేదికగా వీడియో విడుదల చేసి సంచలన ట్విట్ చేశారు.ఇది సీఎం చంద్రబాబు, బాలకృష్ణ ప్రొద్బలంతో జరిగిన దాడులన్నారు. ప్రజాస్వామ్యంను, ప్రాథమిక హక్కుల్ని పూర్తిగా భంగపాటు కల్గించే విధంగా సీఎం చంద్రబాబు పాలన అందిస్తున్నారని ఎద్దేవా చేశారు. మరోవైపు.. ఫర్నీచర్ ధ్వంసం చేయడం ,కార్యకర్తలపై దాడులు చేయడం హేయమైన చర్య అన్నారు.ఈ దాడి వైసీపీపై మాత్రమే కాదని.. ప్రజాస్వామ్యం,  రాజకీయస్వేచ్చను హరించే దాడి అంటూ వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా సీరియస్ అయ్యారు. పోలీసులు కూడా ఈ దాడిపై సరైన విధంగా రియాక్ట్ కాకపోవడం హేయమైన చర్యగా వైఎస్ జగన్ అభివర్ణించారు. మొత్తంగా ఈ ఘటన వైసీపీ వర్సెస్ కూటమి మధ్య ప్రస్తుతం నిప్పులు రాజేస్తుంది.

చంద్రబాబు నాయుడు రాజకీయ ఎజెండా కోసం ఆంధ్రప్రదేశ్ శాంతిభద్రతల యంత్రాంగాన్ని బహిరంగంగా దుర్వినియోగం చేస్తున్నారనే దానికి ఇది సూచికన్నారు.  హిందూపురంలో TDP   అల్లరిమూకలను ఎలా ప్రోత్సహిస్తున్నారో.. అల్లర్ల ద్వారా రాజకీయ వ్యతిరేకతను అణిచివేయడానికి ప్రయత్నిస్తుందో స్పష్టంగా చూపిస్తుందన్నారు.  తన ప్రత్యర్థుల ప్రాథమిక ప్రజాస్వామ్య హక్కులను రక్షించలేని ప్రభుత్వానికి పాలన గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని జగన్‌ విమర్శించారు.  ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది YSRCP పై మాత్రమే కాదు, ప్రజాస్వామ్యం,  రాజకీయ స్వేచ్ఛను విశ్వసించే ప్రతి పౌరుడిపైనా ఉందన్నారు .         

Advertisment
తాజా కథనాలు