/rtv/media/media_files/2025/02/18/hY4oNqrIhnpVWRz61lZd.jpg)
Vallabhaneni Vamshi
వల్లభనేని వంశీకి ఈ ఒక్క రోజే మరో రెండు బిగ్ షాక్ లు తగిలాయి. ఆయనపై ఈ రోజు కబ్జా కేసు నమోదైంది. గన్నవరం గాంధీ బొమ్మ సెంటర్ లో రూ.10 కోట్ల విలువైన స్థలం కబ్జా చేశారని ఆయనపై ఫిర్యాదులు వచ్చాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. హైకోర్టు న్యాయవాది సతీమణి సుంకర సీతామహాలక్ష్మి పేరిట ఉన్న స్థలం కబ్జా చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. మరో వైపు వల్లభనేని వంశీ రిమాండ్ ను న్యాయస్థానం మరోసారి పొడిగించింది. మార్చి 11వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రోజు వర్చువల్ గా జైలు అధికారులు న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు.
ఇది కూడా చదవండి: AP News: వ్యభిచారం వీడియోలు ఎందుకు బయటపెట్టారు.. పోలీసులపై వైసీపీ నేత ఆగ్రహం!
నేటి నుంచి కస్టడీ..
మరోవైపు వంశీ మూడు రోజుల కస్టడీకి న్యాయస్థానం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు ఈ రోజు ఆయనను కస్టడీకి తీసుకున్నారు. ముందుగా ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కస్టడీకి తీసుకున్నారు. మరో వైపు వంశీపై నమోదైన వివిధ కేసుల దర్యాప్తుకు చంద్రబాబు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ సిట్ కు ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ నేతృత్వం వహించనున్నారు. సభ్యులుగా ఏలూరు ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్, తూర్పుగోదావరి ఎస్పీ నరసింహ కిషోర్ వ్యవహరించనున్నారు.
ఇది కూడా చదవండి: Sexual assault: హృదయ విదారక ఘటన.. ముగ్గురు బాలికలపై 18మంది మైనర్ బాలురు లైంగిక దాడి!
వైసీపీ నేత, వల్లభనేని వంశీ రిమాండ్ ను 14రోజులకు పొడిగించిన కోర్టు.
— greatandhra (@greatandhranews) February 25, 2025
మరోవైపు,పటమట పోలీసులు విజయవాడ జైలుకు వెళ్లి వంశీని 3 రోజుల కస్టడీకి తీసుకెళ్లారు. pic.twitter.com/516FakeWd6
వంశీపై అక్రమ మైనింగ్, భూ కబ్జాలు, ఆర్థిక నేరాలు, ఎక్స్ టార్షన్ తదితర అభియోగాల కింద కేసులు నమోదయ్యాయి. వంశీ అక్రమ మైనింగ్ సహా వివిధ నేరాల ద్వారా ప్రభుత్వానికి రూ.195 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు సిట్ ఏర్పాటుకు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. టీడీపీ ఆఫీసులో పని చేసే కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసిన కేసులో వంశీ ఇప్పటికే అరెస్టు అయిన విషయం తెలిసిందే.