/rtv/media/media_files/2025/02/23/kRUpyYpoVHiN2uYZHh2M.jpg)
falling-in-water
AP news : కృష్ణా జిల్లా గన్నవరంలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు పోలవరం కాలువలో పడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన విషాద ఘటన ఆదివారం జరిగింది. బాపులపాడు మండలం వీరవల్లి పోలీస్ స్టేషన్ పరిధి లో ఈ ఘటన జరిగింది. తండ్రితో కలిసి పోలవరం కాలువలో చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు పోలవరం కాలువలో గల్లంతై ఇద్దరు యువకులు మృతి చెందినట్టు గుర్తించారు. చేపలు పడుతూ ఇద్దరూ యువకులు వీరవల్లి గ్రామపంచాయతీ శివారు కొమ్మూరు పోలవరం కాల్వలో సరదగా స్నానానికి దిగి ఇద్దరు గల్లంతయ్యారు... సమాచారం అందుకున్న వీరవల్లి ఎస్ ఐ శ్రీనివాసులు తన సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్లతో ఇద్దరు యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Also Read: Maha Kumbh Mela: కుంభమేళాలో డిజిటల్ స్నానం...కేవలం 1100 లే..అదిరిపోయింది కదా ఐడియా!
మృతులు వీరవల్లి వాసులు షేక్ నాగూర్ భాష, (16) షేక్ షరీఫ్ (17)గా గుర్తించారు. పోలవరం కాలువ నుంచి మృతదేహాలను బయటికి తీయించి.. పోస్టుమార్టం నిమిత్తం గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా.. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Also Read: MAZAKA Trailer: నాన్న ఆంటీ.. కొడుకు అమ్మాయి.. నవ్వులే నవ్వులు 'మజాకా' ట్రైలర్! చూశారా
Also Read: Bhupalpally: అయ్యో! పాపం.. పాలు పట్టించిన గంటల్లోనే ఇద్దరు కవలలు మృతి! ఏమైందంటే