Bhupalpally: అయ్యో! పాపం.. పాలు పట్టించిన గంటల్లోనే ఇద్దరు కవలలు మృతి! ఏమైందంటే

భూపాల్ పల్లిలో కవల పిల్లలు నిద్రలోనే మృతిచెందడం కలకలం సృష్టించింది. మర్రి అశోక్, లాస్యశ్రీ దంపతులకు రెండో సంతానంగా ఇద్దరు కవలలు పుట్టారు. అయితే శనివారం ఇద్దరికీ పాలు పట్టించి నిద్ర పుచ్చగా.. వారు నిద్రలోనే ప్రాణాలు వదిలారు. దీనికి కారణాలేంటి అనేది తెలియాల్సి ఉంది.

New Update
Bhupalpally twins died in sleep

Bhupalpally twins died in sleep

Bhupalpally:  రోజూలాగే పిల్లలు ఏడుస్తుంటే ఆ తల్లి పాలు పట్టించి నిద్రపుచ్చింది. కానీ, ఆరోజు పడుకున్న ఆ ఇద్దరు కవలపిల్లలు మళ్ళీ లేవలేదు. నిద్రలోనే ప్రాణాలు విడిచారు. ఈ విషాదకర ఘటన భూపాల్ పల్లి జిల్లాలో చోటుచేసుకుంది. 

నిద్రలోనే మృతి 

భూపాల్ పల్లి జిల్లా  గణపురం మండలం గొల్లపల్లికి చెందిన మర్రి అశోక్, లాస్యశ్రీ దంపతులకు నాలుగు నెలల రెండో సంతానంగా కవుల పిల్లలు పుట్టారు. ఒక పాప, ఒక బాబు. ప్రస్తుతం లాస్యశ్రీ నగరంపల్లిలోని అమ్మగారి ఇంట్లో ఉంటుంది. అయితే లాస్య శనివారం ఉదయం లాస్య కవలలిద్దరికీ పాలు పట్టించి నిద్రపుచ్చగా.. వారు నిద్రలోనే ప్రాణాలు వదిలారు. ఈ ఘటనపై తల్లి లాస్య శ్రీ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం ఉదయం నిద్రలేవగానే బాబుకు తల్లిపాలు, పాపకు డబ్బా పాలు పట్టించింది. ఆ తర్వాత ఉదయం 8:30 గంటలకు, 11 గంటలకు మళ్ళీ  ఇద్దరికీ డబ్బా పాలు పట్టించింది లాస్య. కొంతసమయం తర్వాత పిల్లలు ఏడవడంతో వారిని నిద్రపుచ్చింది. 

Also read :  మోకాళ్ల లోతు మట్టి, బురద..కష్టతరం అవుతున్న కార్మికుల రెస్క్యూ

అయితే గంట తర్వాత చూస్తే బాబు ముక్కులోంచి పాలు కారడం కనిపించింది. దీంతో బాబును తట్టిలేపగా.. ఎలాంటి స్పర్శ లేదు. మరోవైపు పాపలోనూ చలనం లేకపోవడంతో.. వెంటనే స్థానిక ఆరెంపీ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు. అక్కడ పిల్లలను పరిశీలించిన డాక్టర్ నాడి కొట్టుకోవడం లేదని చెప్పడంతో భూపాలపల్లికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే పిల్లలిద్దరూ చనిపోయినట్లు ఆమె తెలిపింది. అయితే శుక్రవారం రాత్రే పాల పౌడర్ డబ్బా  ఓపెన్ చేసి పిల్లలకు పాలు పట్టించినట్లు లాస్య తెలిపింది. ఆ తర్వాత శనివారం ఉదయం ఇద్దరు కాస్త నలతగానే కనిపించారట. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన స్థానిక ఎస్సై పిల్లలకు ఉపయోగించిన డబ్బాను పరీక్షల నిమిత్తం పంపించినట్లు తెలిపారు.  కన్న బిడ్డల మృతితో ఆ తల్లి కన్నీరుమున్నీరయ్యారు. మరోవైపు పాలపౌడర్‌ డబ్బాపై ఎక్స్‌పైరీ డేట్‌ 2025 ఆగస్టు వరకు ఉండటం గమనార్హం.

Also Read: Maha Kumbh Mela: కుంభమేళాలో డిజిటల్ స్నానం...కేవలం 1100 లే..అదిరిపోయింది కదా ఐడియా!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు