Tirupati: తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం...ముగ్గురి మృతి!
ఏపీ తిరుపతిలో గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. బీఎన్ కండ్రిగ మండలం పార్లవల్లి గ్రామం వద్ద కారు, బైక్ ను ఢీకొట్టింది.
ఏపీ తిరుపతిలో గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. బీఎన్ కండ్రిగ మండలం పార్లవల్లి గ్రామం వద్ద కారు, బైక్ ను ఢీకొట్టింది.
చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ చైర్మన్ సుధీర్ కు చెందిన ప్రియా నర్సింగ్ హోమ్‌పై టీడీపీ నేతలు రాళ్ళ దాడి చేశారు. మున్సిపల్ చైర్మన్ సుధీర్ టీడీపీలో చేరుతారనే ప్రచారంతో తెలుగుదేశం నేతలు ఆగ్రహానికి గురై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఆసుపత్రి అద్దాలను ధ్వంసం చేశారు.
తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ అదనపు ఈవో ధర్మారెడ్డి, సమాచార పౌరసంబంధాల శాఖ మాజీ కమిషనర్ విజయ్ కుమార్‌రెడ్డిపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ క్రమంలో వాళ్ళిద్దరూ అరెస్ట్ కాక తప్పదని చెబుతున్నారు.
సీబీఐ పేరుతో చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే జయదేవనాయుడికి ఓ మహిళ ఫోన్ చేసి చేసింది. మీ ఖాతా నుంచి మనీల్యాండరింగ్ జరిగిందని బెదిరించింది. ఆమెతో పాటూ మరో నిందితుడు కలిపి జయదేవనాయుడి దగ్గర నుంచి రూ.50 లక్షలు దోచుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పాకాల పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
చిత్తూరు జిల్లా దివిటివారిపల్లెలో జూన్ 27న భార్య భారతి గొంతు కోసి చంపిన గణపతిని పోలీసులు అరెస్ట్ చేశారు. రవి అనే వ్యక్తితో ఆమె సన్నిహితంగా ఉంటుదనే అనుమానంతో ఈ దారుణానికి పాల్పడ్డట్లు నిందితుడు అంగీకరించాడని మదనపల్లి డీఎస్పీ ప్రసాద్ రెడ్డి తెలిపారు.
AP: తిరుపతిలో డయేరియా కలకలం రేపుతోంది. ఇద్దరు మానసిక దివ్యాంగులు డయేరియాతో మృతి చెందారు. పాస్ మనోవికాస్ లోని సేవాశ్రమలో 70 మంది ఆశ్రయం పొందుతున్నారు. అందులో 7 మందికి డయేరియా సోకింది. మిగతా ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
శ్రీవారి టిక్కెట్ల విక్రయం, వీఐపీ దర్శనాల్లో టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి, మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారని టీడీపీ నేతలు సీఎస్ కు ఫిర్యాదు చేశారు. వైసీపీకి మేలు చేసేలా వీరు చేసిన అవకతవకలపై సీఐడి లేదా విజిలెన్స్ తో విచారణ జరిపించాలని కోరారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తిరుమల తిరుపతి దేవస్థానం పై దృష్టి పెట్టింది. టీటీడీ నుంచే ప్రక్షాళన మొదలుపెడతామని సీఎం చంద్రబాబు కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రకటించారు. చెప్పినట్టుగానే... టీటీడీలో అవినీతి నిర్మూలన దిశగా అడుగులు పడ్డాయి.
దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు పడుతున్నాయి. తిరుపతిలో ఈరోజు భారీ వర్షం కురిసింది. దీంతో తిరుపతికి వచ్చిన పర్యాటకులు,యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లన్నీ జలమయం అయ్యాయి వాహనదారులు , పాదచారులు తిరగడానికి పాట్లు డుతున్నారు.