Chandrababu: ఒక్కరోజులోనే ఇలా చేయడం హ్యాపీ : సీఎం చంద్రబాబు ఒక్కరోజులో 97 శాతం పింఛన్ల పంపిణీ సంతృప్తిని ఇచ్చిందన్నారు సీఎం చంద్రబాబు. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో పింఛన్లు అందించామన్నారు. రూ. 2737 కోట్లతో 64 లక్షల మందికి ఇంటి వద్ద పెంచిన పింఛన్ల పంపిణీ చేశామన్నారు. By Jyoshna Sappogula 02 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Chandrababu: ఒక్కరోజులో 97 శాతం పింఛన్ల పంపిణీ సంతృప్తిని ఇచ్చిందన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. 1వ తేదీనే ఇంటి వద్ద రూ. 2737 కోట్లతో 64 లక్షల మందికి పెంచిన పింఛన్ల పంపిణీ ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో 97.54 శాతం పింఛన్లు అందించామన్నారు. వృద్దులు, దివ్యాంగులు, ఇతర లబ్దిదారుల ఆర్థిక భద్రత మా బాధ్యత అన్నారు. పెరిగిన పింఛను ఆ పేదల జీవితాలకు భరోసా కల్పిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయిన ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకు అందరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నామన్నారు. Also Read: వయనాడ్‌లో భయంకరమైన పరిస్థితులు.. RTVతో కేరళ వ్యక్తి తెలుగులో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులు అంటే..ప్రభుత్వంలో భాగం అని.. ప్రజలకు ఏ మంచి చెయ్యాలన్నా వారే కీలకం అని అన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ చెల్లించామన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. అనేక సమస్యలు ఉన్నా రూ. 5300 కోట్లు విడుదల చేసి వారికి దక్కాల్సిన జీతం 1తేదీనే చెల్లించామన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణ కార్యక్రమంలో ఉద్యోగులు, అధికారుల పాత్ర ఎంతో కీలకం అన్నారు. ఉద్యోగులతో పని చేయించుకోవడమే కాదు వారి సంక్షేమం చూసే, గౌరవం ఇచ్చే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని అన్నారుఎ. కలిసి కష్టపడదాం.. రాష్ట్ర భవిష్యత్తును మారుద్దాం అని పిలుపునిస్తున్నానన్నారు. #chandrababu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి