IMD: బంగాళాఖాతంలో అల్పపీడనం... ఏపీకి భారీ వర్ష సూచన!
ఒడిశా తీరాన్ని ఆనుకుని వాయువ్య, పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) అమరావతి విభాగం వెల్లడించింది. మరోవైపు ఉపరితలం ఆవర్తనం, రుతుపవన ద్రోణి ప్రభావం వల్ల మంగళవారం కూడా భారీ వర్షాలు పడే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు.