Bhatti Vikramarka : పట్టుదలకు మారు పేరు మోహన్ బాబు : భట్టి విక్రమార్క పట్టుదలకు మారు పేరు మోహన్ బాబు అని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కొనియాడారు. ఈ రోజు ఏపీలోని తిరుపతి జిల్లాలో ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీలో నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డేకు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. By Nikhil 11 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Mohan Babu : తిరుపతి జిల్లా (Tirupati District) చంద్రగిరి మండలం రంగంపేటలోని మోహన్ బాబు యూనివర్సిటీ (Mohan Babu University) లో ఈ రోజు జరిగిన గ్రాడ్యుయేషన్ డే వేడుకలకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) హాజరయ్యారు. ఎంబీఏ, ఎంసీఏ, ఎంఈ, ఐటీ, సీఎస్ఎస్ఈ డిగ్రీలు పూర్తి చేసిన విద్యార్థులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. పట్టుదలకు మారు పేరు మోహన్ బాబు అని కొనియాడారు. ఇది కూడా చదవండి: పైన ఇసుక.. లోన గంజాయ్.. పుష్పను బీట్ చేస్తున్న స్మగ్లర్లు..! విద్యార్థులంతా మోహన్ బాబును ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఎన్టీఆర్ తర్వాత ఆ స్థాయిలో నటించే వ్యక్తి మోహన్ బాబు అని కొనియాడారు. విద్యార్థులు తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యంగా కష్టపడి ఉన్నత స్థాయికి చేరాలని సూచించారు. తల్లి, తండ్రి, గురువు, దైవాలను ప్రతీ విద్యార్థి పూజించాలని మోహన్ బాబు సూచించారు. అప్పుడే ప్రతీ విద్యార్థి ఉన్నతంగా ఎదుగుతారన్నారు. Deputy CM Bhatti Vikramarka Live - 1st Convocation- Mohan Babu University and 13th Graduation Day https://t.co/CEBkEn5twz — Bhatti Vikramarka Mallu (@Bhatti_Mallu) August 11, 2024 తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఏపీలో పర్యటిస్తున్నారు. ఈ రోజు ఉదయం తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రంగంపేటలోని మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగిన గ్రాడ్యుయేషన్ డేకు హాజరయ్యారు. కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క • @Bhatti_Mallu pic.twitter.com/KXV95xokXU — Congress for Telangana (@Congress4TS) August 11, 2024 #mohan-babu #bhatti-vikramarka #tirupati-district #mohan-babu-university మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి