Work outs: 40ల్లో ఉన్నారా... హెవీ వర్కౌట్స్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే.
ఒబేసిటీ ఇప్పుడు అన్నింటికన్నా అతి పెద్ద సమస్యగా తయారయింది. దీనికి కారణాలు అనేకం. కొంతమందికి కొన్ని శారీరక సమస్యల వల్ల వస్తుంటే మరికొంత మందికి మితిమీరిన ఆహారం, బద్ధకం వల్ల వస్తోంది. లావు తగ్గుతున్నారా లేదా అన్న విషయం పక్కన పెడితే దాని మీద ఎవేర్ సెస్ బాగా పెరిగిపోయింది. ఇంకా చెప్పాలంటే అదొక ఫ్యాషన్ కింద తయారయిపోయింది. దానికి తగ్గట్టే బోలెడు రకాల ఫిట్ నెస్ మంత్రాలు కూడా వచ్చేస్తున్నాయి. కల్ట్ ఫిట్ నెస్, యోగా, వర్కౌట్స్, జిమ్ ఇంకోటి, ఇంకోటి... లావు తగ్గడానికి వీటిని ఉపయోగిస్తే పర్వాలేదు కానీ దాన్ని ఫ్యాషన్ గా, పేషన్ గా కూడా తీసుకుంటేనే ప్రమాదం. ఇప్పడు అదే జరుగుతోంది. మితిమీరిన వర్కౌట్లు చేయడం, తమ బాడీకి ఏది సరిపోతుందో తెలుసుకోకుండా ట్రైనింగ్ లు ఫాలో అయిపోవడం...ప్రాణాల మీదకు తెస్తోంది. సెలబ్రిటీలు కూడా ఇందుకు ఏ మాత్రం తీసిపోవడం లేదు.