/rtv/media/media_files/2025/03/23/jzq4WZmPMpz1Jg2j1lEV.jpg)
Kondapalli Srinivas
AP News : రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్లపై సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్తగా 5 లక్షల మందిని అర్హులుగా గుర్తించామని, త్వరలోనే మంజూరు చేస్తామని ఆయన తెలిపారు. అయితే, 93 వేల మంది వితంతువులకు మే నెల నుంచి కొత్తగా పింఛన్లు అందజేయనున్నట్టు మంత్రి శ్రీనివాస్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన విజయనగరం జిల్లా గంట్యాడలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా దాదాపు 5 లక్షల మంది పింఛన్లకు అర్హులని గుర్తించినట్టు వివరించారు. వారందరికీ మే నెలనుంచి పింఛన్లను మంజూరు చేస్తామని పేర్కొన్నారు.
Also Read: Punjab National Bnak Scam:బెల్జియంలో ఛోక్సీ..రప్పించేందుకు భారత్ విశ్వ ప్రయత్నాలు!
అలాగే, ఉపాధి కల్పన, మహిళల స్వయం సాధికారత, మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా మండలాన్ని ఓ యూనిట్‌గా తీసుకుని విజన్ డాక్యుమెంట్‌ను రూపొందిస్తున్నామని మంత్రి తెలిపారు. అలాగే, డ్వాక్రా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి మండలానికి ఒక మహిళా భవనం నిర్మించి, దాన్ని శిక్షణ కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. పేదరిక నిర్మూలనలకు దాతలు సాయం తీసుకుంటున్నామని, నిరుపేద కుటుంబాలను వారికి అప్పగించనున్నామని అన్నారు. తద్వారా పేదలకు మెరుగైన జీవన విధానం అందేలా చర్యలు తీసుకోనున్నామని మంత్రి పేర్కొన్నారు.
Also Read: America: మరో విమానంలో అమెరికా నుంచి అక్రమ వలసదారుల రాక..ఈసారి ఎంతమంది వస్తున్నారంటే..?
అలాగే, బొండపల్లి మండలం గొట్లాం రైతు సేవా కేంద్రంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్.. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషిచేస్తోందని తెలిపారు. గజపతినగరం అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్ సబ్-డివిజన్ పరిధిలోని నాలుగు మండలాల రైతులకు రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాలను మంత్రి కొండపల్లి పంపిణీ చేశారు. అలాగే, పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి అందజేశారు.
కాగా, ఇటీవలశాసన మండలిలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. 50 ఏళ్లు నిండినవారికి పింఛన్ పథకం అమలు చేస్తామని తెలిపారు. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి ఈ మేరకు సమాధానం చెప్పారు. ఒంటరి మహిళలు, డప్పు కళాకారులు, చేనేత కార్మికులు, ఆదివాసీ గిరిజనులు, సాంప్రదాయ చర్మకారులకుఇప్పటికే పింఛన్లు ఇస్తున్నామని ఆయన వివరించారు.. మత్య్సకారులు, గీత కార్మికులు సహా పలు వర్గాలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.