/rtv/media/media_files/2025/08/08/pulivendula-zptc-elections-2025-08-08-18-24-16.jpg)
Pulivendula ZPTC Election
Pulivendula ZPTC Election: వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో టెన్షన్ వాతావరణం నెలకొన్నది. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ మంగళవారం నిర్వహించనున్నారు. ఉప ఎన్నికల నేపథ్యంలో రెండు ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహ రించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా వ్యాప్తంగా ముందస్తు అరెస్ట్‌లు కొనసాగుతున్నాయి. ఈ రెండు స్థానాల నుంచి టీడీపీ, వైసీపీ,కాంగ్రెస్ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు 11 మంది కలిపి మొత్తం 22 మంది పోటీలో ఉన్నారు.పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రాతినిధ్యం వహిస్తుండంతో పులివెందుల స్థానాన్ని ఆ పార్టీ అంత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది.
Also Read : కూలీలో మరో సర్ ప్రైజ్.. యంగ్ రజనీకాంత్ గా స్టార్ హీరో!
ఉప ఎన్నికల నేపథ్యంలో కడప ఎంపీ అవినాష్‌రెడ్డిని పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. దీంతో ఇంటి వద్దే ఆయన నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్తలు ఆయన అరెస్ట్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అయితే వైసీపీ శ్రేణులను అక్కడి నుంచి బయటకు పంపి, అవినాష్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆయనను కడపకు తరలించారు. టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ని అరెస్ట్ చేయడానికి పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. అయితే తనను హౌస్ అరెస్ట్ చేయాలని దానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికలు జరిగే గ్రామాలకు తాను వెల్లనని అవసరమైతే భద్రతను పెంచుకోవచ్చని ఆయన పోలీసులకు సూచించారు. మరోవైపు వేంపల్లిలో సతీష్‌రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు.
ఈ ఎన్నికలను కూటమి, వైసీపీ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పూర్తి పోలీస్ నిఘా నీడలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రోజు ఉదయం 7 గంటలనుంచి సాయంత్రం 5 గంటల వరకు బ్యాలెట్ విధానంలో పోలింగ్ జరగనుంది. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. రెండు మండలాల్లో మొత్తం 1500 మంది పోలీసులు బందోబస్తులో ఉన్నారు. పులివెందుల జడ్పీటీసీకి వైసీపీ, టీడీపీతో కలిసి 11 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బీటెక్ రవి సతీమణి మారెడ్డి లతారెడ్డి, దివంగత వైసీపీ మాజీ జడ్పీటీసీ మహేశ్వరరెడ్డి తనయుడు హేమంత్‌రెడ్డి మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ఈ ఉపఎన్నికల్లో పులివెందుల జడ్పీటీసీ స్థానం పరిధిలోని 15 పోలింగ్ కేంద్రాల్లో 10,600 మంది.. ఒంటిమిట్ట పరిధిలోని 30 పోలింగ్ కేంద్రాల్లో 24వేల మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. రెండు మండలాల్లో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. పులివెందుల, ఒంటిమిట్ట సరిహద్దు, జిల్లా సరిహద్దులో ప్రత్యేక చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు.ఈ నెల 14న ఫలితాలు వెలువడనున్నాయి.
ఇది కూడా చూడండి:Palnadu Ragging: పల్నాడు లో ర్యాగింగ్ కలకలం.. కర్రలతో కొడుతూ.. కరెంట్ షాక్ పెడుతూ! వీడియో వైరల్