Pulivendula ZPTC Election: పులివెందులలో టెన్షన్..టెన్షన్...కొనసాగుతున్న ముందస్తు అరెస్ట్ లు
వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో టెన్షన్ వాతావరణం నెలకొన్నది. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ మంగళవారం నిర్వహించనున్నారు. దీంతో రెండు ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. జిల్లా వ్యాప్తంగా ముందస్తు అరెస్ట్‌లు కొనసాగుతున్నాయి.
MLA Adinarayana Reddy : పులివెందులలో జగన్ కోటను కూలుస్తాం : ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
వైసీపీనేతల వద్ద అవినీతి సొమ్ము బాగా ఉందని అందుకే పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున డబ్బులు పంపిణీ చేస్తున్నారని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. వారి వద్ద నోట్లు తీసుకోండి.. తెదేపాకు ఓట్లు వేయండి అంటూ ఓటర్లను విజ్ఞప్తి చేశారు.
Pulivendula ZPTC By Elections: 30 ఏళ్ల తర్వాత ఎన్నికలు..సంచలనంగా మారిన పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక.
పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తోంది. గడచిన మూడు దశాబ్ధాలుగా ఇక్కడ ఎన్నిక జరగకపోవడం, తొలిసారి ఎన్నికలు జరగనుండటంతో పులివెందుల నేడు హాట్ టాఫిక్‌గా మారింది. వైఎస్ హయాం నుంచి పులివెందులలో జడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడూ ఏకగ్రీవమే అయ్యాయి.