Pulivendula ZPTC Election: పులివెందులలో టెన్షన్..టెన్షన్...కొనసాగుతున్న ముందస్తు అరెస్ట్ లు
వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో టెన్షన్ వాతావరణం నెలకొన్నది. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ మంగళవారం నిర్వహించనున్నారు. దీంతో రెండు ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. జిల్లా వ్యాప్తంగా ముందస్తు అరెస్ట్లు కొనసాగుతున్నాయి.