/rtv/media/media_files/2025/10/21/jubilee-hills-by-elections-2025-10-21-12-32-24.jpg)
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో టీడీపీ, జనసేన మద్దతు తనకు ఉంటుందని బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. నేడు ఆర్టీవీతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఉందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో తనకు ఆయా పార్టీల ఉంటుందని భావిస్తున్నానన్నారు. వాళ్లు తన ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉందని తనకు సమాచారం ఉందన్నారు. నేటి తన నామినేషన్ ర్యాలీకి గోవా సీఎంతో పాటు మరో ఇద్దరు కేంద్ర మంత్రులు హాజరు అవుతారని చెప్పారు.
నేటి కాంగ్రెస్, గత బీఆర్ఎస్ ప్రభుత్వాలు నియోజకవర్గంలో కనీసం డ్రైనేజీ సమస్యను కూడా పరిష్కరించలేకపోయారని ఫైర్ అయ్యారు. ఇలాంటి వాళ్లకు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. తనను గెలిపిస్తే సమస్యల పరిష్కారానికి ఫైట్ చేస్తానన్నారు. కొందరు ఓ వర్గం ఓట్లతో గెలిచే ప్రయత్నం చేశారని ఫైర్ అయ్యారు. తాము ప్రచారంలో వెనుకబడడం లేదన్నారు. బూత్ లెవల్లో ప్రచారం చేస్తున్నామన్నారు. బీజేపీ మంచి మెజార్టీతో జూబ్లీహిల్స్ లో గెలవనుందని జోస్యం చెప్పారు.
Follow Us