/rtv/media/media_files/2025/08/17/ntr-2025-08-17-11-37-01.jpg)
జూనియర్ ఎన్టీఆర్ పై అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఫోన్ కాల్ లో మాట్లాడిన ఆడియో సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సంభాషణ తెలుగు యువత నేత గుత్త ధనుంజయ నాయుడు, ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ మధ్య జరిగింది. వార్-2 సినిమా రిలీజ్ సందర్భంగా అనుమతులతో ఈ సినిమాను ఆడిస్తున్నారా లేదా అని అతడ్ని ఎమ్మెల్యే ప్రశ్నించారు. సినిమాకు అన్ని అనుమతులు ఉన్నా సరే నేను అనంతపురం ఎమ్మెల్యేను.. సినిమా ఆడదన్నారు, ఆడనివ్వనన్నారు.
‘ఆ లం*కొ**.. మా లోకేష్‌తోనే పెట్టుకుంటాడా?’
— PulseNewsBreaking (@pulsenewsbreak) August 17, 2025
‘వాని సినిమా ఆడదు’ అంటూ.. జూ.ఎన్టీఆర్‌ని బూతులు తిట్టిన అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్
బుక్కా పకీర్ నా కొడు*.. లోకేష్ సార్‌ని తిడతాడా.. వాడి సినిమా ఆడదంటూ ఫోన్లో రెచ్చిపోయిన టీడీపీ ఎమ్మెల్యే
సోషల్ మీడియాలో… pic.twitter.com/pwThPyxtrm
జూనియర్ ఎన్టీఆర్ సినిమా వార్ 2 సినిమా షోలను అనంతపురంలో ఆపేయాలంటూ ఎమ్మెల్యే దగ్గుబాటి వార్నింగ్ ఇచ్చినట్లుగా ఆడియో కాల్ లో ఉంది. మంత్రి లోకేష్ పై ఎన్టీఆర్ అలా ఎలా మాట్లాడుతాడని ఆడియో కాల్ లో ఎమ్మెల్యే ప్రశ్నించారు. లోకేష్ గురించి మాట్లాడితే ఊరుకుంటమా వెంటనే థియేటర్ కు వచ్చిన ఆడియన్స్ ను పంపించాలని ఫోన్ లో ఎమ్మెల్యే సూచించారు. ఈ ఆడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో ఎమ్మెల్యే ప్రసాద్‌పై తారక్ అభిమానుల మండిపడుతున్నారు.
ఆడియో కాల్ పై ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్
అయితే ఈ ఆడియో కాల్ పై ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ స్పందించారు. తాను మొదటి నుంచి నందమూరి కుటుంబానికి అభిమానిని అని చెప్పుకొచ్చారు. బాలకృష్ణ, ఎన్టీఆర్ సినిమాలంటే ఇష్టంగా చూసేవాడినని అన్నారు. తాను జూనియర్ ఎన్టీఆర్ ను దూషిస్తున్నట్టుగా ఆడియో కాల్స్ సృష్టించారని, ఆ ఆడియో కాల్స్ నావి కాదని, రాజకీయ కుట్రలో భాగంగానే చేస్తున్నారని అన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో రిలీజ్ చేశారు. నారా, నందమూరి కుటుంబాలకు తాను ఎప్పటికీ విధేయుడునే అని చెప్పుకొచ్చారు. ఈ ఆడియో కాల్స్ వల్ల జూనియర్ అభిమానులు మనసును నచ్చుకొని ఉంటే తన వైపు నుంచి క్షమాపణ చెబుతున్నానని అన్నారు.
Also Read : ఎంత గొప్ప మనసయ్యా.. రూ.13వేల కోట్లు విరాళమిచ్చిన వ్యాపారవేత్త
నేను మొదటి నుంచి నందమూరి కుటుంబానికి అభిమానిని
— oneindiatelugu (@oneindiatelugu) August 17, 2025
బాలకృష్ణ, ఎన్టీఆర్ సినిమాలంటే ఇష్టంగా చూసేవాడిని
కానీ నేను జూనియర్ ఎన్టీఆర్ ను దూషిస్తున్నట్టుగా ఆడియో కాల్స్ సృష్టించారు
ఆ ఆడియో కాల్స్ నావి కాదు... రాజకీయ కుట్రలో భాగంగానే చేస్తున్నారు - ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్#JrNTR… pic.twitter.com/AjsAiXZkhv
Also Read : Udaya Bhanu : రెమ్యూనరేషన్ అడిగితే బ్యాడ్ గా ప్రచారం చేశారు.. ఉదయభాను సంచలన కామెంట్స్