AP: నా పేరుతో దందాలు చేస్తే ఊరుకోను..ఏపీ హోంమంత్రి గట్టి వార్నింగ్‌!

ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. తన పేరుతో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠినంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కొందరు తనతో ఫోటోలు దిగి దందాలు చేస్తున్నట్లు తనకు తెలిసిందన్నారు.

New Update
Vangalapudi Anitha: రాష్ట్రంలో పిచ్చికుక్క పాలన సాగుతోంది.. వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు

తన పేరుతో ఎవరైనా దందాలకు పాల్పడితే ఊరుకునేది లేదని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత గట్టిగా హెచ్చరించారు. తన పేరుతో ఎవరైనా ఇసుక, భూ దందాలు చేస్తే కఠినంగా చర్యలు తీసుకుంటానాని మంత్రి అన్నారు. హోంమంత్రి సొంత నియోజకవర్గం పాయకరావుపేటలో ఉన్న సారిపల్లిపాలెం నివాసంలో పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు కలిశారు. వారి సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించారు.

Also Read: RaasiPhal: ఈ 6 రాశుల వారికి డబ్బులే..డబ్బులు...మరి మీ రాశి ఇందులో ఉందో లేదో తెలుసుకోండి!

Home Minister Vangalapudi Anitha

కొంతమంది తనతో ఫోటోలు దిగి, వాటిని ఉపయోగిస్తూ దందాలు చేస్తున్నారని తన దృష్టికి వచ్చినట్లు మంత్రి అన్నారు. ఇలాంటి తప్పులకు ఎవరు పాల్పడినా ఊరుకునేది లేదని చెప్పారు. సీతంపాలెంకు చెందినవారు ఓ వ్యక్తి తమ వ్యవసాయ పరికారలను దౌర్జన్యంగా లాక్కెళ్లారని హోంమంత్రికి చెప్పారు. అలాగే ఏపీఐఐసీ నిర్వాసితుల కోసం పెదబోదుగల్లం దగ్గర చేపడుతున్న భూసేకరణ పరిహారం కోసం పలువురు రైతులు అనితను కలిసి తమ విజ్ఙప్తులు అందించారు.

Also Read: Cumin, Jaggery: జీలకర్ర-బెల్లం నీటిని రోజూ తీసుకుంటే అద్భుత ప్రయోజనాలు

ఎకరాకు రూ.30 లక్షల వరకు ఎక్కువ పరిహారం ఇస్తున్నామని.. చిన్న ఇబ్బందులున్నా అభివృద్ధి కోసం ప్రజలు సహకరించాలన్నారు. ఈ మేరకు రైతులకు పరిహారంపై అధికారులతో మాట్లాడతామన్నారు.ఈ మేరకు ఏవైనా భూ సేకరణ సమస్యలు ఉంటే కలెక్టర్‌తో మాట్లాడి పరిష్కరిస్తామన్నారు.కూటమి ప్రభుత్వం యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తోందని మంత్రి వివరించారు.

Also Read: UP: భోజనాలు లేటయ్యాయని..పెళ్లి క్యాన్సిల్‌ చేసుకున్న పెళ్లికొడుకు!

పాయకరావుపేటలో నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్‌మేళాలో మంత్రి పాల్గొన్నారు. మొత్తం 54 కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించగా.. దానికి నిరుద్యోగ యువత భారీగా తరలి వచ్చారు. గతంలోనే నిరుద్యోగులకు ఉపాధిపై ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని మంత్రి అన్నారు.

Also Read: Bullet Train: చైనా మరో అద్భుతం.. గంటకు 450 కి.మీ ప్రయాణించగల రైలు ఆవిష్కరణ

ముందుగా తొలి విడతలో 2,286మందికిైగా ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. పాయకరావుపేట నియోజకవర్గంలో 25వేల ఉద్యోగాలు కల్పించాలన్నదరే తమ లక్ష్యమన్నారు. మరో ఆరు నెలల్లో  పాయకరావుపేట నియోజకవర్గం పరిధిలోని నక్కపల్లి మండలం ఇండస్ట్రియల్ హబ్‌గా మారుతుందన్నారు. మిట్టల్‌ ఉక్కు పరిశ్రమ వస్తే మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు