AP Crime: కడపలో దారుణం.. వృద్ధురాలి గొంతు కోసి బంగారు గొలుసు ఎత్తుకెళ్లిన దొంగ!

కడప జిల్లా కమలాపురం గిడ్డింగ్ వీధిలో మహిళ ఇంట్లో దూరి కంట్లో కారంపొడి చల్లి గొంతు కోసి పది తులాల బంగారు గొలుసు తీసుకెళ్లాడు దుండగుడు. తీవ్ర రక్తస్రావంతో పడి ఉన్న క్షతగాత్రురాలిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితురాలు లక్ష్మీదేవి (42)గా గుర్తింపు.

New Update
knife kadapa

AP Crime

AP Crime: ఈ మధ్య కాలంలో మనుషులకు మానవత్వం లేకుండా పోతుంది. సింపుల్‌గా డబ్బులు సంపాదించటం కోసం ఎంతటికైనా తెలగిస్తున్నారు. కొందరైతే ప్రాణాలు కూడా తీస్తున్నారు. తాజాగా బంగారు గొలుసు కోసం ఓ మహిళ ప్రాణాలు తీశాడు ఓ దుర్మార్గుడు. ఈ ఘటన ఏపీలో కలకలం రేపింది.  

ఇది కూడా చదవండి: హోలీ పండుగపై గందరగోళం.. అసలు తేదీ ఎప్పుడు?

కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గొంతు కోసి బంగారు గొలుసు తీసుకెళ్లిన్నాడు దుండగుడు. కమలాపురం గిడ్డింగ్ వీధిలో ఒంటరిగా ఉన్న మహిళ ఇంట్లో దూరి కంట్లో కారం పొడి చల్లి గొంతు కోసి పది తులాల బంగారు గొలుసు తీసుకెళ్లాడు. తీవ్ర రక్తస్రావంతో పడి ఉన్న క్షతగాత్రురాలిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. క్షతగాత్రురాలు కరంగూడి లక్ష్మీదేవి (42) గా గుర్తింపు. 

పక్క ప్లాన్‌తో...

ఇది కూడా చదండి: యాలకులను లైట్‌ తీసుకున్నారో.. ఈ ప్రయోజనాలన్నీ మిస్‌ అవుతారు

బంగారు గొలుసు ఇస్తే ఏమీ చేయను.. ఇవ్వకపోతే చంపేస్తానని పక్కింటి ఆకుల నవీన్ (21) బెదిరించాడని బాధితురాలు చెబుతోంది. కమలాపురం మున్సిపల్ కార్యాలయంలో పంపు ఆపరేటర్‌గా బాధితురాలు భర్త కరంగూడి శేఖర్‌రెడ్డి పనిచేస్తున్నాడు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన కమలాపురం ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు. ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి నిందితుని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

ఇది కూడా చదవండి: యాలకులను లైట్‌ తీసుకున్నారో.. ఈ ప్రయోజనాలన్నీ మిస్‌ అవుతారు

Advertisment
తాజా కథనాలు