KA Paul: సచివాలయం ఎదుట కేఏ పాల్ నిరసన
ఏపీ సచివాలయం ఎదుట ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ నిరసన చేపట్టారు. ఎన్నికల మార్గదర్శకాలపై రాజకీయ పార్టీలతో నిర్వహించిన సమావేశానికి తనను ఆహ్వానించకపోవటంపై ఆందోళన చేశారు.
ఏపీ సచివాలయం ఎదుట ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ నిరసన చేపట్టారు. ఎన్నికల మార్గదర్శకాలపై రాజకీయ పార్టీలతో నిర్వహించిన సమావేశానికి తనను ఆహ్వానించకపోవటంపై ఆందోళన చేశారు.
CECకి రెండు లేఖలు రాశారు అచ్చెన్నాయుడు. టీడీపీ అభ్యర్థులను వేధిస్తానంటూ MLC దువ్వాడ శ్రీనివాస్ అంటున్నారని లేఖలో ఫిర్యాదు చేశారు. అలాగే, రాజకీయ ప్రచారంలో వాలంటీర్ల ప్రమేయం ఉండకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రశాంత్ కిశోర్ టీడీపీకి బ్రోకర్ గా పనిచేస్తున్నాడని విమర్శలు గుప్పించారు మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్. ఈ క్రమంలోనే రాష్ట్రం అభివృద్ధి చేయాలంటే అప్పు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర సచివాలయం తాకట్టు పెడితే ప్రతిపక్షాలకు ఎందుకు తలనొప్పి అంటూ ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్లో ఈరోజు నుంచి హాల్టికెట్లు విడుదల కానున్నాయి. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్సైట్ www.bse.ap.gov.in నుంచి విద్యార్ధులు హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాగా.. మార్చి 18 నుంచి 30 వరకూ పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయి.
మున్సిపల్ కార్మికులకు ఏపీ గవర్నమెంట్ గుడ్ న్యూస్ చెప్పింది. కార్మికుల 16 డిమాండ్లలో 9 సమస్యలను పరిష్కరించేందుకు అంగీకరించింది. కార్మికుల జీతాలు 5వేలకు పైగా పెంచుతున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.
శ్రీకాకుళం జిల్లాలో డోంకురు సముద్ర తీర ప్రాంతానికి ఓ భారీ తిమింగలం కొట్టుకొచ్చింది. దీంతో, చుట్టుపక్కల విద్యార్థులు సముద్ర తీరానికి చేరుకుని తిమింగలంపై చిందులేస్తు ఆటాలాడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
వైవీ సుబ్బారెడ్డిపై మంత్రి ధర్మాన పరోక్ష విమర్శలు చేశారు. కడప నుంచి శ్రీకాకుళం వచ్చి.. భూములు ఆక్రమించేందుకు పావులు కదుపుతున్నారని మండిపడ్డారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారు ఈ జిల్లా భూములను, ఆస్తులను తీసుకోవడమేంటని ప్రశ్నించారు.
జనసేనకు 24 స్థానాలు కేటాయించడంపై కాపు కుల పెద్దలు మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా చూడాలనుకున్న కాపు జాతి మొత్తాన్ని అవమానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగైతే కాపు జాతి సహకరించదంటూ హెచ్చరిస్తూ.. పవన్ ను చంద్రబాబు వాడుకుని వదిలేస్తాడంటూ రగిలిపోతున్నారు.
విద్యార్థులకు అలర్ట్. ఏపీలో ఇంటర్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఏపీ ఇంటర్ బోర్డు ఈ హాల్ టికెట్స్ ను అధికారిక వెబ్ సైట్లో అందుబాటులో ఉంచింది. https://bieap.apcfss.in/ క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.