AP DSC: డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్
డీఎస్సీ అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం తిపి కబురు అందించింది. డీఎస్సీ దరఖాస్తుల గడువు రేపటితో ముగియనున్న నేపథ్యంలో.. తాజాగా గడువును పెంచింది. ఈ నెల 25వ తేదీ వరకు పొడిగించింది.
డీఎస్సీ అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం తిపి కబురు అందించింది. డీఎస్సీ దరఖాస్తుల గడువు రేపటితో ముగియనున్న నేపథ్యంలో.. తాజాగా గడువును పెంచింది. ఈ నెల 25వ తేదీ వరకు పొడిగించింది.
ఏపీలో పార్టీ మారిన 8మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇవాళ ఎమ్మెల్యేల పిటిషన్ పై విచారణ చేపట్టగా వీరేవరూ రాకపోవడంపై స్పీకర్ సీరియస్ అయ్యారు. న్యాయ సలహా తర్వాత అనర్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
రాజ్య సభ ఎన్నికల్లో పోటీ చేయొద్దని నిర్ణయించుకున్నారు టీడీపీ చీఫ్ చంద్రబాబు. ఎమ్మెల్యేల సంఖ్య బలం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రేపటితో నామినేషన్ల స్వీకరణ గడువు ముగియనుంది. 27న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి.
ఆంధ్రాలో ప్రభుత్వ టీచర్ల ఉద్యోగాల కోసం చూస్తున్న వారి ఎదురు చూపులు ఫలించాయి. ఫైనల్‌గా డీఎస్సీ నోటిపికేషన్‌ను విడుదల చేసింది వైసీపీ గవర్నమెంట్. అర్హులైన అభ్యర్ధులు ఈ నెల 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చును. మార్చి 15 నుంచి 30 వరకు ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు.
సీఎం జగన్‌కు లేనిది ఉన్నట్లు.. ఉన్నది లేనట్లు చెప్పే జబ్బు వచ్చిందని లోకేష్ సెటైర్లు వేశారు. తల్లిని, చెల్లిని ఇంట్లో నుంచి బయటకు నెట్టేసిన వ్యక్తి జగన్ అని మండిపడ్డారు. ప్రాణహాని ఉందని జగన్ చెల్లెలు షర్మిల బయటకు వచ్చి చెబుతున్నారని అన్నారు.
పొత్తుల కోసం పాకులాడటమే ప్రతిపక్షాల పని అంటూ విమర్శలు గుప్పించారు మంత్రి సీదిరి అప్పలరాజు. ఓటమి భయంతోనే పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారన్నారు. గత ఎన్నికల్లో కంటే ఈసారి ఎన్నికల్లో వైసీపీకి ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం వైసీపీ వైస్ ఎంపీపీ జరుగుళ్ల శంకర్‌పై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఎమ్మెల్యే గొర్లె కిరణ్, ఎంపీపీ మొదలవలస చిరంజీవి తనను మట్టు పెట్టేందుకు యత్నించారంటున్నారు శంకర్. ఈ ఘటనలో ఆయన తీవ్ర గాయాలతో బయటపడ్డాడు.
లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీదే విజయం అని చెబుతోంది మూడ్ ఆఫ్ ది నేషన్ ఇండియా టు డే సర్వే. ఈ సారి అన్ని అడ్వాంటేజీలు చంద్రబాబుకే ఉన్నాయని చెబుతోంది. ఆంధ్రాలోని 25 ఎంపీ స్థానాల్లో టీడీపీ-17, వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు 8 సీట్లు గెలవనునట్లు అంచనా వేసింది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో.. 2024-25 ఆర్థిక ఏడాదికి సంబంధించి రూ.2,86,389 కోట్లుగా అంచనాతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను.. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టారు. రూ.2,20,110 కోట్ల రెవెన్యూ ఆదాయం, రూ.30,530 కోట్ల మూలధన వ్యయంతో పద్దును ప్రతిపాదించారు.