AP Liquor Policy: ఏపీలో మందుబాబులకు బ్యాడ్‌న్యూస్..!

ఆంధ్రప్రదేశ్‌లోని మందుబాబులకు పెద్ద కష్టమే వచ్చింది. షాపుల్లో కొన్ని బ్రాండ్ల మద్యం, బీర్లకు తీవ్ర కొరత ఏర్పడింది. మద్యం వ్యాపారులు ఆర్డర్లు పెడుతున్నా.. కొన్ని బ్రాండ్ల మద్యం, బీర్లు షాపులకు సరఫరా కావడం లేదు అంటున్నారు.

New Update
apli

AP Liquor : ఏపీలో కొత్త మద్యం పాలసీ అమలవుతోంది. పోయిన నెలలో రాష్ట్రవ్యాప్తంగా 3,396 షాపులకు లాటరీ నిర్వహించి నిర్వహకులకు ఇవ్వడంతో మద్యం షాపులను నిర్వహిస్తున్న  సంగతి తెలిసిందే. దీంతో వెంటనే అమ్మకాలు మొదలయ్యాయి..రూ.99కే క్వార్టర్‌ మద్యాన్ని అందుబాటులోకి తెచ్చింది ఏపీ ప్రభుత్వం. అయితే మందుబాబులకు ఇప్పుడు చాలా పెద్ద కష్టమే వచ్చినట్లు తెలుస్తుంది.

Also Read: Green Cards: 10 లక్షల మంది భారతీయులకు షాకిచ్చేందుకు రెడీ అయిన ట్రంప్‌

బీర్లకు తీవ్ర కొరత...

రాష్ట్రంలోని మద్యం షాపుల్లో కొన్ని బ్రాండ్ల మద్యం, బీర్లకు తీవ్రంగా కొరత ఉందని మందుబాబులు వాపోతున్నారు. వ్యాపారులు ఆర్డర్లు పెడుతున్నా ఆయా బ్రాండ్ల మద్యం తగినంత మేర షాపులకు సరఫరా కావడం లేదంట. ఈ మద్యం బ్రాండ్లలో ప్రధానంగా ఇంపీరియల్‌ బ్లూ, మెక్‌ డోవెల్స్‌ వంటి బ్రాండ్లకు బాగా కొరత వచ్చిందంట. బీర్లలో కింగ్‌ఫిషర్‌, బడ్‌వైజర్‌ వంటి బ్రాండ్ల లభ్యత చాలా తక్కువగా ఉందని చెబుతున్నారు. పది కేసులకు ఆర్లరు పెడితే కనీసం ఒక్క కేసు కూడా సరఫరా అవ్వడం లేదంట.

Also Read:  Rains: మరో అల్పపీడనం..రెండు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజుల పాటు వానలే..

దీంతో మందుబాబులకు పెద్ద కష్టమే వచ్చింది. అయితే అధికారులు మాత్రం త్వరలోనే అన్ని బ్రాండ్లు అందుబాటులోకి వస్తాయని అంటున్నారు. రాష్ట్రంలో మద్యం ఎమ్మార్పీ ఉల్లంఘనలు, బెల్టు షాపులను ఉపేక్షించవద్దని మంత్రి కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు. ఎవరు తప్పు చేసినా శిక్ష తప్పదనే సంకేతాలివ్వాలని అధికారులకు సూచించారు.

Also Read:  Russia: ట్రంప్‌తో చర్చలకు సిద్ధం–రష్యా అధ్యక్షుడు పుతిన్

ఎక్సైజ్‌ శాఖ సిబ్బందితో మంత్రి రవీంద్ర సమీక్ష నిర్వహించారు. ఏపీని కల్తీ మద్యం రహిత రాష్ట్రంగా తయారు చేద్దామన్నారు. రాష్ట్రంలో తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందించాలని.. అవసరమైన చోట్ల డీఅడిక్షన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

Also Read: NASA: సునీతా విలియమ్స్ ఆరోగ్యంగానే ఉన్నారు–నాసా

మరోవైపు ఏపీలో మద్యం షాపుల్లో ఎమ్మార్పీ కంటే ఎక్కువ తీసుకుంటే కఠిన చర్యలు తీసుకోవాలని  ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మద్యం ధరల విషయంలో సీఎం ధికారులకు కీలకమైన ఆదేశాలు ఇచ్చారు.. మద్యాన్ని ఎమ్మార్పీని మించి అమ్మితే తొలిసారి రూ.5లక్షలు జరిమానా విధించాలన్నారు. ఆ తర్వాత కూడా తప్పు చేస్తే మద్యం షాపుల లైసెన్స్‌ను రద్దు చేయాలని అధికారులకు సూచించారు.   బెల్ట్‌ షాపుల విషయలో కఠినంగా వ్యవహరించాలని.. అనుమతించవద్దని, బెల్ట్‌ షాపులను ప్రోత్సహించిన వారిపైనా చర్యలు తీసుకోవాలన్నారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు