నా పిల్లల మీద ఒట్టు ప్రభాస్ ఎవరో తెలియదు.. అంతా జగనన్నే చేశాడు!

ప్రభాస్ తో తనకు సంబంధం ఉందంటూ సోషల్ మీడియాలో జరిగిన ప్రచారంపై షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. 'మా పిల్లల మీద ఒట్టేసి చెబుతున్న ప్రభాస్ ఎవరో నాకు తెలియదు. ఆయనను నేను ఎప్పుడూ చూడలేదు' అంటూ కన్నీరు పెట్టుకుంది. వీడియో వైరల్ అవుతోంది.

author-image
By srinivas
New Update
YS Sharmila: నన్ను ఓడించేందుకు కుట్ర.. సీఎం జగన్‌పై షర్మిల విమర్శల దాడి

Sharmila: ప్రభాస్ తో తనకు సంబంధం ఉందంటూ సోషల్ మీడియాలో జరిగిన ప్రచారంపై షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. 'మా పిల్లల మీద ఒట్టేసి చెబుతున్న ప్రభాస్ ఎవరో నాకు తెలియదు. ఆయనను నేను ఎప్పుడూ చూడలేదు' అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. 

బాలకృష్ణ ఇంటి నుంచి తప్పుడు ప్రచారం..

ఈ మేరకు శుక్రవారం మీడియాతో మాట్లాడిన షర్మిల.. నా మీద బాలకృష్ణ ఇంటి నుంచి తప్పుడు ప్రచారం జరిగిందని ఒక్క ఎంటర్టైన్మెంట్ వీడియో చూపించారు. మీకు ఇలా జరిగిందని తెలిసి ఉంటే మీరు ఐదేళ్లు సీఎంగా ఉన్నారు. అప్పుడు గాడిదలు కాసారా? ఎంక్వైరీ ఎందుకు చేయలేదు? ప్రభాస్ కు నాకు సంబంధం ఉందని వచ్చిన ప్రచారం మీ సోషల్ మీడియా ప్రచారం చేయలేదా? మా పిల్లల మీద ఒట్టేసి చెప్తున్న ప్రభాస్ ఎవరి నాకు తెలియదు. ఆయన్ని నేను ఎప్పుడూ చూడలేదు. జగన్ ఈ ప్రాపగాండా చేయించారనే ప్రచారం జరిగింది.నా వీడియో చూపించి జగన్ సానుభూతి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. 

ఇది కూడా చదవండి: Heart Healthy: చలికాలంలో గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పని చేయండి

మోదీకి జగన్ దత్త పుత్రుడు..

ఇక జగన్ ఆయన స్వార్థం కోసం అమ్మపై కేసు పెడతారు. నాన్న పేరు సీబీఐ చార్జి షీట్ లో పెడతారు. చెల్లిపై దుష్ప్రచారం చేయిస్తారు. జగన్ మోదీకి దత్త పుత్రుడు. ఆయన మీద ఎంక్వైరీ వేస్తారా? అని ప్రశ్నించారు. అలాగే గౌతమ్ అదానీపై అభియోగాలు చేశారు. గౌతం అదానీ టీం దేశంలో కొంత మంది సీఎంలకు లంచాలు ఇచ్చినట్టు తెలిపారు. ఇందులో ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినట్టు వెల్లడించారు. జగన్ పేరు చెప్పలేదు. కాని ఆగస్టు 2021 లో ముడుపులు ముట్టయని తెలిపారు. పవర్ సప్లైలో ఏపీ సీఎంను గౌతం అదానీ.. జగన్ ను కలిసి మీకు ఏమి కావాలో ఇస్తామని ప్రామిస్ చేశారు. ఏమి ఇస్తే ఏమీ అవుతుందనే డిస్కస్ జరిగినట్టు షర్మిల పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: అదానీపై కేసు వ్యవహారం.. వైట్‌హౌస్‌ స్వీట్ రియాక్షన్!

అదానీని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి..
తెలంగాణ సీఎం రేవంత్ అదానీని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని సూచించారు. ఒక సహచరిగా రేవంత్ కు విజ్ఞప్తి చేస్తున్నా. అదానీతో బిజినెస్ చేయొద్దు. నేను జగన్మోహన్ రెడ్డి నీ ఎత్తి చూపకపోతే నా ఆస్తి నాకు ఇస్తానని అంటున్నారు. కానీ నేను మాట్లాడకుండా ఉండలేను. నేను కాంగ్రెస్ పార్టీ చీఫ్. ఇలాంటివి నేను మాట్లాడుకుంటే ఎలా? జగన్ బాటలో చంద్రబాబు నడవోద్దని ఏపీ సీఎం చంద్రబాబుకు కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది. ఇక మీద అదానీకి ప్రాజెక్ట్స్ ఇ.వ్వొద్దు మోదీ అదానీ వేర్వేరు కాదు. మోదీ అధానికి రక్షణ కల్పిస్తున్నారు. అదానీ.. మోడీకి డబ్బులు ఇస్తున్నారు. సెబీ చీఫ్ కూడా అదానీ చేతిలో ఉంది. అదానీపై అమెరికాలో ఫైర్ నమోదు చేసిన ఇక్కడ ఆయనపై ఎటువంటి చర్యలు లేవు. దీన్ని చూస్తేనే అర్థం అవుతుంది మోదీ.. అదానీల బంధం. పదేళ్లలో అదానీ అందనంత ఎత్తుకు ఎదిగాడు. ఇంత డబ్బులు స్పందించడం ఎలా సాధ్యం? మోదీ రక్షణతోనే అదానీపై ఎలాంటి చర్యలు లేవు. అదానీ వ్యవహారం మోదీకి, దేశానికి అవమానం. మోదీ కాంగ్రెస్ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ విమర్శలు గుప్పించారు. 

ఇది కూడా చదవండి: Maoist: మావోయిస్టుల రివేంజ్.. ఇన్ఫార్మర్లను గొడ్డలితో నరికి చంపి..!

ఇది కూడా చదవండి: Breaking: ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు సంచలన తీర్పు!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు