Maoist: మావోయిస్టుల రివేంజ్.. ఇన్ఫార్మర్లను గొడ్డలితో నరికి చంపి..! ములుగు జిల్లాలో మావోయిస్టులు దారుణానికి పాల్పడ్డారు. ఏజెన్సీ వాజేడులో ఇన్ఫార్మర్ల నేపంతో ఇద్దరు గిరిజనులు అర్జున్, రమేష్‌ను గొడ్డలితో నరికి చంపారు. పద్ధతి మార్చుకోవాలని చెప్పినా వారు వినలేదని మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. By srinivas 22 Nov 2024 | నవీకరించబడింది పై 22 Nov 2024 12:24 IST in క్రైం వరంగల్ New Update షేర్ చేయండి Maoist: వరుస ఎన్ కౌంటర్లపై ప్రతీకారంతో రగిలిపోతున్న మావోయిస్టులు దారుణానికి పాల్పడ్డారు. ఇన్ఫార్మర్ల కారణంగానే పార్టీ నష్టపోతున్నట్లు భావించి నిఘా పెట్టిన మావోయిస్టులు.. మరో ఇద్దరు ఇన్ఫార్మర్లను హతమార్చారు. ఈ మేరకు గురువారం రాత్రి ములుగు జిల్లా ఏజెన్సీ వాజేడులో ఇన్ఫార్మర్ నేపంతో ఇద్దరు గిరిజనులను గొడ్డలితో అతి కిరాతకంగా నరికి చంపారు. చెప్పిన వినలేదంటూ మావోయిస్టుల లేఖ.. మృతిచెందిన వ్యక్తులు అర్జున్, రమేష్ గా పోలీసులు గుర్తించారు. రమేష్ పేరూరు పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గురువారం రాత్రి 11.30 నిమిషాలకు ఈ సంఘటన జరిగినట్లు నిర్ధారించారు. అయితే మృతులకు పద్ధతి మార్చుకోవాలంటూ గతంలో హెచ్చరికలు జారీ చేసినా పట్టించుకోవట్లేదని, వాజేడు - వెంకటాపురం ఏరియా కార్యదర్శి శాంత పేరుతో మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. #Mulugu Maoist Murders #warangal #maoist మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి