ఆంధ్రప్రదేశ్‌లో దారుణమైన ఘటన జరిగింది. క్లాస్ రూమ్‌లో విద్యార్థులకు పాఠాలు చెప్తున్న ఓ టీచర్‌ను కొందరు దుండగులు కిడ్నాప్ చేయడం కలకలం రేపింది. అయితే పోలీసులే కిడ్నాప్ చేశారంటూ కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. Also Read: ఏపీ వాసులకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాలలో మరో రెండ్రోజులు వానలే వానలు టీచర్ కిడ్నాప్ ఏపీలోని కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం అల్లుగుండు ప్రభుత్వ పాఠశాలలో మునీర్ అహ్మద్ అనే వ్యక్తి టీచర్‌గా పనిచేస్తున్నాడు. అతడు క్లాస్ రూమ్‌లో పాఠాలు చెప్తుండగా దుండగులు వచ్చి బయటకు పిలిచారు. అలా బయటకు తీసుకెళ్లారు. మీరెవరని ప్రశ్నిస్తే.. పోలీసులమని చెప్పారు. అయితే అప్పటికే మునీర్‌కు అనుమానం వచ్చింది. Also Read: అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసింది రేవంత్ అనుచరులేనా? ప్రూఫ్స్ తో సహా..! ఈ లోపే దుండుగులు అతడ్ని బలవంతంగా వెహికల్‌లో ఎక్కించారు. ఆపై అరకుండా గొంతు నొక్కారు. ఇక ఉదయం 10 గంటల నుంచి మునీర్ ఆచూకీ లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అంతేకాకుండా పోలీసులే మునీర్‌ను కిడ్నాప్ చేశారని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా మునీర్ కిడ్నాప్ కావడం ఇది తొలిసారి కాదు. ఇంతకముందు రెండు సార్లు కిడ్నాప్‌కి గురయ్యాడు. ఇది మూడో అటెంప్ట్ కావడం గమనార్హం. Also Read: కాచిగూడ-చెన్నై ఎగ్మోర్ రైలులో మంటలు అయితే దీనికి కారణం భూవివాదమేనని తెలుస్తోంది. కర్నూల్ సెంట్రల్ స్కూల్ బ్యాక్‌సైడ్ రూ.20 కోట్ల విలువచేసే భూవివాదమే దీనికి కారణమని సమాచారం. ఈ విషయంలోనే మునీర్‌ను కిడ్నాప్ చేశారంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా ఈ భూవివాదంలో మునీర్ ఇప్పటికే ఫిర్యాదుదారుగా ఉన్నారు. ప్రస్తుతం దీనిపై హైకోర్టులో విచారణ సాగుతోంది. Also Read: ప్రభుత్వమే సిగ్గులేకుండా 'పుష్ప'ను ప్రోత్సహించింది.. నారాయణ!