Sajjala Rama Krishna Reddy : వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగిన సజ్జల రామకృష్ణరెడ్డి కి ఎదురు దెబ్బలు తప్పడం లేదు. కార్యకర్తలను పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో కృష్ణాజిల్లా పామర్రులో వైసీపీ కార్యకర్తల నుంచి ఊహించని ఘటన ఎదురైంది.
Also Read: ఏపీ మంత్రి సుభాష్ కు తప్పిన పెను ప్రమాదం!
కష్టకాలంలో అండగా ఉండాల్సిన నాయకులే పట్టించుకోకపోతే ఎలా అని వైసీపీ కార్యకర్తలు ఆ పార్టీ ప్రధానకార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిని నిలదీశారు. కృష్ణాజిల్లా పామర్రులో మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఇంటికి సజ్జల వచ్చారు. ఈ విషయం తెలుసుకొని పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు.
నేతలతో మాట్లాడి ఆయన వెళ్లిపోతుండగా కార్యకర్తలు అడ్డుకుని నిలదీశారు. ఇంతమంది కార్యకర్తలు వస్తే కనీసం పలకరించకుండా వెళ్లిపోవడమేంటని ప్రశ్నించారు. ధైర్యంగా ఉండి పార్టీ కోసం పోరాడాలనే భరోసా ఇవ్వకుండా అలా ఎలా వెళ్లిపోతారని నిలదీశారు. దీంతో చేసేదేమీ లేక సజ్జలతో పాటు అక్కడి నేతలు వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.
Also Read: బీఆర్ఎస్ నేతలకు మావోయిస్టులు వార్నింగ్!
జగన్‌కు బై..బై! జనసేనలోకి విడదల రజిని!
విడదల రజిని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి 2019 ఎన్నికల్లో తొలిసారి పోటీ చేశారు. ప్రత్యర్థిపై ఎనిమిది వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆ తర్వాత మంత్రి అయ్యారు. ఇక 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమిపాలవ్వడంతో ఒక్కొక్కరుగా టీడీపీ, జనసేన పార్టీలోకి జంప్ అవుతున్నారు. ఇప్పుడు విడదల రజిని సైతం అదే బాటలో అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
మాజీ మంత్రి విడదల రజిని వైసీపీకి గుడ్‌బై చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే జనసేనలోకి వెళతారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఇటీవలే జనసేనలో చేరిన బాలినేని శ్రీనివాసరెడ్డి ద్వారా పవన్‌ను కలిసేందుకు విడదల రజిని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా బాలినేని శ్రీనివాస రెడ్డి.. రజిని కలిసి చర్చించినట్లు సమాచారం. అయితే ఈ విషయంలో విడుదల రజిని అనుచరులు రియాక్ట్ అవుతున్నారు. పార్టీ మార్పు లేదంటూ వారు చెబుతున్నారు.
Also Read: నాపై డ్రగ్స్ కుట్ర చేశారు..ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి సంచలన ఆరోపణలు
పొలిటికల్ ఎంట్రీ
2014 ఎన్నికల సమయంలో విడదల రజినీ ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. అక్కడి నుంచి రజిని రాజకీయ ప్రస్తానం మొదలైంది. నిత్యం ప్రజల్లో ఉంటూ వారితో కలిసిపోయారు. రజిని తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌లో చక చకా మాట్లాడటంతో ఆమె ప్రతిభను గుర్తించిన ప్రత్తిపాటి పుల్లారావు 2017లో వైజాగ్ లోని మహానాడులో రజినితో మాట్లాడించారు.
అందులో విడదల రజినీ తన ప్రసంగంతో చంద్రబాబు దృష్టిని ఆకర్షించింది. దీంతో ఒక్కసారిగా రజిని పేరు మారుమోగిపోయింది. ఇప్పటికీ అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతూనే ఉంటాయి. ఇలా ఓ వైపు పాపులారిటీ తెచ్చుకుంటూనే మరోవైపు విఆర్ ఫౌండేషన్ పేరుతో సేవా కార్యక్రమాలు చేపట్టారు. దీంతో 2019 ఎన్నికల్లో తనకు చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని కోరారు. కానీ తనకు టికెట్ ఇవ్వలేనని చంద్రబాబు చెప్పేశారు.
దీంతో విడదల రజినీ కీలక నిర్ణయం తీసుకున్నారు. వెంటనే వైసీపీ పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. తొలి ఎన్నికల్లోనే టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావుపై 8000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక అదే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన విడదల రజినినీ 2022 ఏప్రిల్ 11న జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఆమెకు వైద్య ఆరోగ్య శాఖల మంత్రిగా అవకాశం ఇచ్చారు.