AP: ఏపీ మంత్రి సుభాష్‌ కు తప్పిన పెను ప్రమాదం!

ఏపీ కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది. కాకినాడ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమానికి మంగళవారం మంత్రి సుభాష్ హాజరయ్యారు.వేదిక మీదకు ఎక్కువ మంది చేరుకోవటంతో ఒకవైపు ఒరిగిపోయింది. దీంతో మంత్రి కిందకు పడబోయారు.

New Update
ap min

AP: ఏపీ కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌కు కొద్దిలో ప్రమాదం తప్పింది. కాకినాడ జిల్లా లోని ఎన్‌ఎన్‌ పట్నం గ్రామంలో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమానికి వాసంశెట్టి సుభాష్ వచ్చారు. గ్రామంలోని శెట్టిబలిజలు దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించడంతో మంత్రి వాసంశెట్టి సుభాష్, ప్రత్తిపాడు ఎమ్మెల్యే సత్యప్రభ హాజరయ్యారు. 

Also Read:  ఆగని బాంబు బెదిరింపులు..ఈరోజు 32 ఎయిర్ ఇండియా విమానాలకు

అయితే కార్యక్రమంలో భాగంగా నేతలు ప్రసంగిస్తున్న సమయంలో  వేదిక ఒక్కసారిగా ఓ వైపు ఒరిగిపోయింది. దీంతో మంత్రి వాసంశెట్టి సుభాష్ కింద పడబోయారు. అయితే పక్కనే ఉన్న భద్రతా సిబ్బంది, అనుచరులు వెంటనే అప్రమత్తమై ఆయనను కింద పడకుండ పట్టుకున్నారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

Also Read:  హరియాణా ఎన్నికలు..కాంగ్రెస్ ఆరోపణలు నిజం కావు–ఈసీ

అయితే ఒక్కసారిగా ఎక్కువ మంది వేదికపైకి చేరుకోవటంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు నిర్థారించారు. పరిమితికి మించి వేదికపైకి ఎక్కడంతో వేదిక ఒరిగిపోయింది. అయితే సిబ్బంది అప్రమత్తతతో మంత్రి కి  ప్రమాదం తప్పింది. ఈ ఘటన తర్వాత కార్యక్రమాన్ని మరో వేదిక మీదకు మార్చారు. కార్యక్రమాన్ని అక్కడే నిర్వహించారు. 

కేరళ సీఎం కాన్వాయ్‌కు ఘోర ప్రమాదం

కేరళ సీఎం కాన్వాయ్‌కు ఘోర ప్రమాదం జరిగింది. నడిరోడ్డుపై పైలెట్‌ వెహికల్‌ సడన్‌ బ్రేక్‌తో సీఎం కాన్వాయ్‌లోని వాహనాలన్నీ ఒకదానితో మరోటి ఢీ కొన్నాయి. కేరళ రాజధాని తిరువనంతపురంలోనే సీఎం కాన్వాయ్‌కు ప్రమాదం జరిగింది. కొట్టాయం నుంచి సీఎం తిరువనంతపురం సిటీలోకి వస్తున్నప్పుడు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Also Read:  అమల్లోకి గస్తీ ఒప్పందం..బలగాల ఉపసంహరణ

సిటీలోని ఎంసీ రోడ్డు నుంచి అత్తింగల్‌ వచ్చే రోడ్డులో ఒక మహిళా స్కూటరిస్ట్‌ కుడి వైపునకు తిరిగే ప్రయత్నం చేసింది. వెనుక నుంచి వచ్చిన సీఎం కాన్వాయ్‌లోని పైలెట్‌ వాహనం స్కూటరిస్ట్‌ని తప్పించుకునేందుకు సడన్‌ బ్రేక్‌ వేసింది. ఈ క్రమంలో పైలెట్‌ వాహనాన్ని వెనుక నుంచి వెనుక వాహనాలు ఢీకొట్టాయి. మధ్యలో సీఎం విజయన్‌ వాహనం ఉంది. కాన్వాయ్‌లో వెనుక వాహనాన్ని అంబులెన్స్‌ ఢీకొట్టింది. కాగా ఈ ప్రమాదంలో సీఎం విజయన్‌ కు ఎలాంటి ప్రమాదం జరగలేదు.

Also Read:  దీపావళి రోజే కేటీఆర్‌పై బాంబ్‌?

Advertisment
Advertisment
తాజా కథనాలు