Maoist Party: బీఆర్ఎస్ నేతలకు మావోయిస్టులు వార్నింగ్! TG: దళిత బంధు పేరుతో ప్రజలను మోసం చేసిన నేతలారా ఖబద్దార్ అంటూ బీఆర్ఎస్ నేతలను హెచ్చరించింది మావోయిస్టు పార్టీ. దళిత బంధు ఇప్పిస్తామని పేద ప్రజల నుంచి తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వాలని.. లేదంటే శిక్ష తప్పదని జగన్ పేరుతో లేఖను విడుదల చేసింది. By V.J Reddy 30 Oct 2024 in తెలంగాణ వరంగల్ New Update షేర్ చేయండి Maoists Warning : బీఆర్ఎస్ పార్టీ నేతలకు మావోయిస్టు పార్టీ వార్నింగ్ లెటర్ విడుదల చేసింది. దళిత బంధు పేరుతో ప్రజలను మోసం చేసిన బీఆర్ఎస్ నేతలారా ఖబద్దార్ అంటూ హెచ్చరించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దళిత బంధు పేరుతో ప్రజలను మోసం చేశారని ఆరోపణలు చేసింది. దళిత బంధు ఇప్పిస్తామని లక్షల రూపాయలు వసూలు చేశారని మండిపడింది. అమాయకుల నుంచి వసూలు చేసిన డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసింది. ప్రజలకు డబ్బు తిరిగి ఇవ్వకపోతే శిక్ష తప్పదని లేఖలో మావోయిస్టులు హెచ్చరించారు. మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ విడుదల చేశారు. Also Read : కాణిపాకంలో అపచారం..ఆలయ ప్రధాన అర్చకుడిపై వేటు లేఖలో ఏముంది?... "జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన దళిత బంధు పేరుతో అమాయక ప్రజలకు మాయమాటలు చెప్పి దళిత బంధు ఇప్పిస్తామని ఆశలు చూపి మొదటి విడత రెండో విడత అని లక్షల రూపాయలు తీసుకొని ప్రజలను మోసం చేసి ఇబ్బందులకు గురి చేస్తున్న రాజకీయ బ్రోకర్స్ లారా ఖబర్దార్ ఇప్పటికైనా తమ పద్ధతులు మార్చుకుని తిరిగి ప్రజల దగ్గర తీసుకున్న రూపాయలు ఇవ్వాలని హెచ్చరిస్తున్నాం. Also Read : విజయమ్మకు వైసీపీ కౌంటర్! జయశంకర్ భూపాలపల్లి లో మహా ముత్తారం. మాజీ zptc మందల రాజిరెడ్డి. మార్క రామ్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పక్కల సడవలి మాజీ zptc భర్త లింగమల్ల దుర్గయ్య, మాజీ ఎంపీపీ భర్త రత్నం సడవలి, పీసీసీ నెంబర్ బెల్లంకొండ కిష్టయ్య, కాటారం మాజీ ఎంపీటీసీ తోట జనార్ధన్. మాజీ జడ్పీ చైర్మన్ జక్కు శ్రీహర్షిని భర్త రాకేష్, భూపెళ్లి రాజు. మహాదేవపూర్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు లింగంపల్లి శ్రీనివాసరావు, మహాదేవపూర్ మాజీ సర్పంచ్ శ్రీపతి బాపు, పలిమెల బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జవాజి తిరుపతి. మల్హాల్ రావు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాఘవరెడ్డి, మాజీ జెడ్పిటిసి గోనె శ్రీనివాసరావు. భూపాలపల్లి మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ కొత్తపల్లి హరిబాబు, ప్రజల దగ్గర తీసుకున్న డబ్బులు వెంటనే తిరిగి ఇవ్వాలి ఇవ్వని ఎడల ప్రజల చేతిలో శిక్ష తప్పదని హెచ్చరిస్తున్నాం" అని లేఖను విడుదల చేశారు. Also Read : ఆస్తుల వివాదం.. జగన్ సంచలన వ్యూహం! Also Read : ఆ ఊరిపై పగబట్టిన పాము.. ఏం చేసిందో తెలిస్తే షాకవుతారు! #brs #maoist-party మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి