Sajjla Bhargav: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్ హైకోర్టు ఆశ్రయించారు. గుంటూరు పోలీస్ స్టేషన్ లో తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీఎం చంద్రబాబు, లోకేష్‌పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారని కేసు నమోదైన సంగతి తెలిసిందే. వైసీపీ సోషల్ మీడియా పూర్వ ఇన్‌ఛార్జి సజ్జల భార్గవ్‌రెడ్డి వేసిన పిటిషన్ పై ఈరోజు హైకోర్టు విచారణ చేపట్టనుంది.
Also Read: Rains: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం.. నేడు ఈ జిల్లాలలో భారీ వర్షాలు!
అసలేమైంది...
అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలను సోషల్ మీడియా వేదికగా చేస్తున్నారంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికే అధికార పార్టీ నేతలపై వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారని పోలీసులు కేసు నమోదు చేస్తున్న విషయం విదితమే. అయితే.. ఇటీవల సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సహా వారి కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో గుడివాడ ముబారక్ సెంటర్‌కు చెందిన వైసీపీ కార్యకర్త మహ్మద్ ఖాజాబాబా అభ్యంతరకర పోస్టులు పెట్టారని గుడివాడ బాపూజీనగర్ 13వ వార్డుకు చెందిన టీడీపీ అధ్యక్షుడు ఏ.శ్రీరాం కనకాంబరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఖాజాబాబాను అరెస్ట్ చేశారు.
Also Read: Varra Ravindra Reddy: వర్రా రవీందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్!
భార్గవ్ చెప్పాడనే...
కాగా విచారణలో ఖాజాబాబా పోలీసులకు కీలక విషయాలు చెప్పాడు. తాను సజ్జల భార్గవ్ రెడ్డి చెప్పిన విధంగానే సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు, లోకేష్ పై అసభ్యకర పోస్టులు పెట్టానని పోలీసులు అతడు తెలిపాడు. ఇదే విషయాన్నీ పోలీసులు రిమాండ్ రిపోర్టులో చేర్చారు. నిందితుడి ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సజ్జల భార్గవ్, అర్జున్‌రెడ్డి, వినోద్ తదితరులను ఈ కేసులో నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు. ఈ క్రమంలో సజ్జల భార్గవ్ తనను పోలీసులు అరెస్ట్ చేయకుండా ఉండేందుకు హైకోర్టులో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. కాగా భార్గవ్ పిటిషన్ పై హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనే ఉత్కంఠ వైసీపీ శ్రేణుల్లో కొనసాగుతోంది.