Dharmasthala: ధర్మస్థల చిన్నయ్య పెద్ద అబద్ధాల కోరు..భీమా భార్య

కర్ణాటక పుణ్యక్షేత్రం ధర్మస్థల లో పెద్ద సంఖ్యలో శవాలు పాతినట్లు చెప్పిన చిన్నయ్య అలియాస్ భీమా  మొదటి నుంచీ పెద్ద అబద్ధాల కోరు అని అతని భార్య చెబుతున్నారు. మాండ్యా జిల్లాలో చిక్కబళ్లి గ్రామానికి చెందిన అతడిని దర్యాప్తు బృందం విచారిస్తోంది.

New Update
chinnayya

Dharmasthala Chinnayya

చిన్నయ్య అబద్ధాలు చెప్పడం కొత్తేమీ కాదని అంటున్నారు అతని భార్య రత్నమ్మ. మా ఇద్దరికీ 1999లో పెళ్ళయిందని చెప్పారు.తానొక సివిక్ వర్కర్ గా చేశానని తెలిపారు. తమక ఇద్దరు పిల్లలు ఉన్నారు. తరువాత 2006లో విడిపోయామని రత్నమ్మ చెప్పాను. చిన్నయ్య అలియాస్ భీమా తనను తీవ్రంగా కొట్టేవాడని...అందుకే విడిపోయానని చెప్పారు. విడాకుల సమయంలో కూడా అతను చాలా అబద్ధాలు చెప్పాడని...తనకు ఇవ్వాల్సిన భరణం ఎగ్గొట్టేందుకే అలా చేశాడని ఆరోపించారు. కోర్టు కూడా అతని మాటలనే నమ్మిందని రత్నమ్మ అన్నారు. దాని వలన తనకు, తన పిల్లలకు చాలా అన్యాయం జరిగిపోయిందని వాపోయారు. 

మొదటి నుంచీ అబద్ధాలకోరే..

చిన్నయ్య తనతో ఉన్నన్నాళ్ళూ ఎప్పుడూ అత్యాచారాలు, సామూహిక ఖననాల గురించి చెప్పలేదని రత్నమ్మ చెప్పారు. డబ్బు కోసమే ధర్మస్థల వివాదంలో తలదూర్చాడని చెప్పుకొచ్చారు. 2014లో చిన్నయ్య ధర్మస్థల నుంచి వెళ్ళిపోయాడు. ఆమెను తన ఊళ్ళో వారికి భార్యగా చెప్పాడు. అతనికి మూడు సార్లు పెళ్ళి అయిందని స్థానికులు చెబుతున్నారు. కానీ అందరి నుంచీ విడిపోయి..ఇప్పుడు ఒంటరిగానే ఉంటున్నాడని అన్నారు. చిక్కబళ్లికి చెందిన బాలు అనే వ్యక్తి మాట్లాడుతూ చిన్నయ్య డబ్బుకోసం ఏమైనా చేస్తాడని ఆరోపించాడు. 2014లో వెళ్ళిపోయిన అతను తరిగి మళ్ళీ 2024లో ధర్మస్థలకు వచ్చాడు. గ్రామ పంచాయతీ చూపించిన ఖాళీ స్థలంలో షెడ్డు వేసుకున్నాడు. ఆ స్థలాన్ని తనపేరిట రాసి ఇవ్వాలని పంచాయతీ సిబ్బందితో గొడవ పెట్టుకున్నాడని గ్రామ ప్రజలు సెట్ అధికారులకు తెలిపారు. 

తప్పుడు సమాచారంతో ప్రభుత్వాన్ని, ప్రజలను తప్పుదారి పట్టించాడని ముసుగు వ్యక్తి భీమాను సిట్ అధికారులు అరెస్టు చేశారు. ధర్మస్థలకు చెడ్డపేరు తెచ్చే ప్రయత్నం చేశాడనే అభియోగంతో అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల ధర్మస్థల వ్యవహారం జాతీయ స్థాయిలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ ప్రాంతంలో వందలాది మంది మృతదేహాలను తాను పూడ్చిపెట్టానని మాజీ పారిశుద్ధ్య కార్మికుడు భీమా ఆరోపణలు చేశారు. అందులో ఎక్కువగా అత్యాచారం, హత్యలకు గురైన మహిళలవే ఉన్నట్లు తెలిపాడు. దీంతో రంగంలోకి దిగిన సిట్‌ అధికారులు తవ్వకాలు ప్రారంభించారు. కానీ మృతదేహాలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదు. 

అయితే శుక్రవారం రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు సిట్‌ ప్రధాన అధికారి అయిన ప్రణబ్ మహంతి.. భీమాను విచారించారు. అతడు మాయమాటల చెప్పి వ్యవస్థను నమ్మించి చివరికి ఏమీ తెలియదని అంటున్నాడని సిట్‌ విచారణలో గుర్తించారు. ఈ క్రమంలోనే అధికారులు భీమాను అరెస్టు చేశారు. శనివారం అతడిని కోర్టులో హాజరుపర్చనున్నారు. అంతకు ముందు కూడా భీమా ఈ కేసు విషయంలో మాట మార్చాడు. తనకు ఒకరు పుర్రె ఇచ్చి సిట్‌ అధికారులకు ఇవ్వాలని చెప్పారని.. కోర్టులో అర్జీ కూడా వారే చేయించారని పేర్కొన్నాడు. 2014 నుంచి తాను తమిళనాడులోనే ఉంటున్నానని చెప్పాడు. దీంతో ధర్మస్థల వ్యవహారం మలుపు తిరిగింది.

Advertisment
తాజా కథనాలు