/rtv/media/media_files/2025/04/29/9V5DJnYSsdFQ6CU4nPL5.jpg)
Rayalaseema Express
Rayalaseema Express : అనంతపురం జిల్లా గుత్తి వద్ద నిజామాబాద్--తిరుపతి -రాయలసీమ ఎక్స్‌ప్రెస్ లో చోరీ జరిగింది. ఆగి ఉన్న రైలులోకి ఐదుగురు దుండగులు చొరబడి చోరీకి పాల్పడ్డారు. ప్రయాణికులకు చెందిన బంగారం, నగదుతో పాటు నగదు, మొబైల్ ఫోన్లు, ఇతర విలువైన వస్తువులను అపహరించారు.
Also Read: పాకిస్తాన్‌లో 170 న్యూక్లియర్ బాంబులు.. వాటి రిమోట్ ఎవరి చేతిలో ఉందో తెలుసా..?
వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా గుత్తి వద్ద రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో చోరీ జరిగింది. సోమవారం అర్ధరాత్రి దాటాక 1.30 గంటల సమయంలో ఆగి ఉన్న రైలులోకి ఐదుగురు దుండగులు చొరబడి దొంగతనానికి పాల్పడ్డారు. ప్రయాణికులకు చెందిన బంగారం, నగదుతో పాటు విలువైన వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లారు. దాదాపు 30 తులాల బంగారం ఎత్తుకెళ్లినట్టు బాధితులు తెలిపారు. దీనిపై 20 మంది బాధితులు తిరుపతి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమరావతి ఎక్స్‌ప్రెస్‌కు లైన్‌క్లియర్ చేసేందుకు గుత్తి శివారులో రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపారు. ఈ సమయంలోనే దుండగులు ఆ రైలులోకి చొరబడి10 బోగీల్లో దోపిడీకి పాల్పడ్డారు. దీనిపైబాధితులు తిరుపతి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దుండగుల కోసం గాలిస్తున్నట్టు తెలిపారు.
ఇది కూడా చూడండి: Sitakka: నీ బిడ్డ కార్లలో తిరిగితే.. మా ఆడబిడ్డలు బస్సులో కూడా తిరగొద్దా?: కేసీఆర్ కు సీతక్క స్ట్రాంగ్ కౌంటర్!
 
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గుత్తి రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరా ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. రాయలసీమ ఎక్స్ ప్రెస్ తెలంగాణలోని నిజామాబాద్ లో మొదలై కామారెడ్డి, లింగంపల్లి, సికింద్రాబాద్, గుత్తి మీదుగా తిరుపతి వెళ్తుంది. 
Also Read: బ్యాగ్‌లో బాంబ్- విమానంలో ‘అల్లా హు అక్బర్’ అంటూ భయపెట్టిన వ్యక్తి!
 Follow Us
 Follow Us