Kashibugga Temple: కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ చోరీ.. రూ.60 లక్షల విలువైన ఆభరణాలు ఎత్తుకెళ్లిన దుండగులు

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ దొంగతనం జరిగింది. గుడి వెనుక వైపు నుంచి గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి బంగారం, వెండి నగలు ఎత్తుకెళ్లారు. రూ.60 లక్షలు విలువ చేసే ఆభరణాలు దొంగతనానికి గురైనట్లు ఆలయ ధర్మకర్త తెలిపారు.

New Update
Kashibugga Temple

Kashibugga Temple

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ దొంగతనం జరిగింది. గుడి వెనుక వైపు నుంచి గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి బంగారం, వెండి నగలు ఎత్తుకెళ్లారు. ఈ చోరీ జరిగినట్లు సోమవారం ఆలయ అర్చకులు గుర్తించారు.  అనంతరం ఆలయం ధర్మకర్త ముకుందపండా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాదాపు రూ.60 లక్షలు విలువ చేసే ఆభరణాలు దొంగతనానికి గురైనట్లు తెలిపారు. ఘటనాస్థలాన్ని కాశీబుగ్గ డీఎస్పీ షేక్‌ సహబాజ్‌ అహ్మద్‌, సీఐ రామకృష్ణ పరిశీలించారు. 

Also read: ప్రియుడితో పారిపోయిన భార్య.. కాల్చిచంపిన భర్త

ఇదిలాఉండగా ఈ ఆలయంలో గతేడాది నవంబర్ 1న తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో 9 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జరిగిన తర్వాత పోలీసుల ఆదేశాల మేరకు ఆ గుడిలో దర్శనాలను నిలిపివేశారు. ప్రస్తుతం ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో తాజాగా అక్కడ దొంగతనం జరగడం కలకలం రేపుతోంది. నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని అక్కడి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 

Also Read: భోగి మంటలు ఎందుకు వేస్తారు? ఆ మంటల్లో ఏం వేయాలి? ఏం వేయకూడదో తెలుసా?

Advertisment
తాజా కథనాలు