/rtv/media/media_files/2025/02/03/OFvLiqs19PofJbnmVjxK.jpg)
kachidi
మత్స్యకారులు వేటకు సముద్రంలోకి వెళ్లినప్పుడు అప్పుడప్పుడు కొన్ని అరుదైన చేపలు దొరుకుతుంటాయి. అలా కొన్నిసందర్భాల్లో దొరికే ఒక్క చేప వల్ల మత్స్యకారుల జీవితాలు మారిపోతాయి.. కొన్ని చేపలకు మార్కెట్‌లో భారీగా డిమాండ్ ఉంటుంది. ఏకంగా రూ.లక్షల్లో పలుకుతాయి. ఈ అరుదైన చేపలు కూడా గోదావరి జిల్లాల్లో మత్స్యకారుల వలకు ఎక్కువగా వస్తూంటాయి. తాజాగా కాకినాడలో మత్స్యకారులకు అరుదైన చేప దొరికింది.. కాసుల వర్షం కురిపించింది.
కాకినాడ సముద్రతీరంలో మత్స్యకారుల వలకు ఆదివారం 25 కిలోల కచిడి చేప లభించింది. ఈ అరుదైన చేపగా కచిడి చేప మత్స్యకారులకు కాసులు కురిపించింది.ఈ చేపను కుంభాభిషేకం రేవులో విక్రయించగా ఏకంగా రూ.3.95 లక్షలు పలికింది. ఈ చేపకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని అందుకే అంత డిమాండ్ ఉందని స్థానిక మత్స్యకారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఔషధ గుణాలు ఉంటాయని.. అందుకే దీనికి విపరీతమైన డిమాండ్ ఉంటుందని మత్స్యకారులు తెలియజేస్తున్నారు.
ఈ కచిడి చేప సాంకేతిక నామం ప్రొటోనిబియా డయాకాన్తస్. ఈ చేపల రెక్కలు గరుకుగా, చిన్నగా ఉంటాయి.. చేప పొట్ట భాగం మాత్రం గట్టిగా ఉంటుందని మత్స్యకారులు అంటున్నారు. వీటిలో కూడా మగ కచిడి చేపలు బంగారు వర్ణంలో మెరుస్తూ కనిపిస్తాయి.. అందుకే వీటిని గోల్డ్ ఫిష్ అని కూడా పిలుస్తారు. ఈ చేపలు రుచిగా ఉంటాయి.. అలాగే ఔషధగుణాలు ఉంటాయని మత్స్యకారులు చెబుతున్నారు. డాక్టర్లు సర్జరీల తర్వాత కుట్లు వేసే దారాన్ని ఈ చేప గాల్ బ్లాడర్‌తో తయారు చేస్తారని మత్స్యకారులు వివరిస్తున్నారు.
అంతేకాదు పలురకాల మందుల తయారీలోనూ దీని భాగాలను ఉపయోగిస్తారంటున్నారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నఈ చేప రికార్డు స్థాయి ధర పలుకుతోంది.
Also Read: Horoscope Today:నేడు ఈ రాశివారికి అనుకున్నది ఒకటి..జరిగేది ఒకటి..సో జర భద్రం!