/rtv/media/media_files/2025/05/01/NIxgEaKy4bNIpKutZYQg.jpg)
AP Liquor Scam
ఏపీ లిక్కర్ స్కామ్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కేసిరెడ్డి పీఏ పైలా దిలీప్‌ను అరెస్ట్ అయ్యారు. చెన్నై ఎయిర్‌పోర్టులో సిట్ అధికారులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. దిలీప్ చెన్నై నుంచి దుబాయ్ పారిపోతుండగా ఎయిర్‌పోర్టులోనే అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన్ని విజయవాడకు తరలిస్తున్నారు.
Also Read: నమాజ్ చేయడానికి బస్సు ఆపిన డ్రైవర్.. బిగ్ షాకిచ్చిన ఆర్టీసీ!
అయితే ఈ లిక్కర్ కేసుకు సంబంధించి దిలీప్ పోలీసుల ముందు హాజరుకావాలని ఇప్పటికే సిట్ బృందం నోటీసులు జారీ చేసింది. కానీ పోలీసుల ముందు హాజరుకాకుండా దేశం విడిచిపెట్టి వెళ్లేందుకు దిలీప్ ప్లాన్ వేశాడు. దీంతో సిట్ బృందం డిజిటల్, ఫోన్ లోకేషన్‌ల ద్వారా పీఏ కదలికలపై సిట్ టీమ్ నిఘా పెట్టింది. చివరికి దిలీప్ చైన్నై ఎయిర్‌పోర్టులో ఉన్నట్లు గుర్తించిన అధికారులు వెంటనే అక్కడికి వెళ్లి ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు.
Also Read: పహల్గామ్ ఉగ్రదాడిపై సుప్రీం కోర్టులో పిటిషన్.. కీలక నిర్ణయం!
లిక్కర్ స్కామ్‌కు సంబంధించి రాజ్ కేసిరెడ్డి పీఏ వద్ద కీలకమైన సమాచారం ఉన్నట్లు సిట్ బృందాలు భావిస్తున్నాయి. అయితే కమిషన్‌లు ఇచ్చే డిస్ట్లరీ యజమానులతో దిలీప్ తరచుగా కాంటాక్టులో ఉండేవాడని.. డిస్ట్లరీ యజమానులు సిట్ బృందానికి చెప్పారు. అంతేకాదు రాజ్ కేసిరెడ్డి లిక్కర్ గ్యాంగ్‌లో ఉన్నవాళ్లు పీఏ చెబితేనే కమిషన్లు వసూలు చేసేవారని దర్యాప్తులో తేలింది. ఎవరి ఆదేశాల మేరకు డిస్ట్లరీ యజమానులకు ఫోన్లు చేశారనేది పీఏ నుంచి సమాచారం సేకరించవచ్చని సిట్ భావిస్తోంది.
Also Read: ‘కాళీ’తో పాక్ పని ఖతం.. భారత్ దగ్గరున్న ఈ రహస్య ఆయుధం గురించి మీకు తెలుసా..?
ap liquor scam | telugu-news | andhra-pradesh