విశ్వహిందూ పరిషత్ జాతీయ ట్రస్టీగా పుట్టగుంట సతీష్

పారిశ్రామికవేత్త పుట్టగుంట వెంకట సతీష్ కుమార్‌ ఇవాళ విశ్వహిందూ పరిషత్ జాతీయ ట్రస్టీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవిలో మూడేళ్లు కొనసాగనున్నారు. VHP జాతీయ ఉపాధ్యక్షులు గోకరాజు గంగరాజు చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు.

New Update
Puttagunta V Sateesh

ప్రముఖ పారిశ్రామికవేత్త పుట్టగుంట వెంకట సతీష్ కుమార్‌ ఇవాళ విశ్వహిందూ పరిషత్ జాతీయ ట్రస్టీగా బాధ్యతలు స్వీకరించారు. బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జాతీయ ప్రధాన కార్యదర్శి మిలింద్ పరాండే నేతృత్వంలో VHP జాతీయ ఉపాధ్యక్షులు, మాజీ పార్లమెంట్ సభ్యులు గోకరాజు గంగరాజు చేతుల మీదుగా నియామక పత్రం అందించారు. 

ఇది కూడా చూడండి: అంతర్జాతీయ క్రికెట్‌కు ఆర్ అశ్విన్ రిటైర్మెంట్

మూడేళ్ల పాటు ఈ హూదాలోనే

ఈ హోదా పదవీ కాలం మూడు సంవత్సరాలు ఉంటుంది. ఈ పదవిని గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గోకరాజు గంగరాజు, పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత పుల్లారెడ్డి, పార్లమెంట్ సభ్యులు T .G .వెంకటేష్ నిర్వహించారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ పదవి పుట్టగుంట వెంకట సతీష్ కుమార్‌కి రావడం అభినందనీయం అని వారు పేర్కొన్నారు.

ఇది కూడా చూడండి:  బలపడుతున్న అల్పపీడనం.. మూడు రోజులు అతి భారీ వర్షాలు 

ఇదిలా ఉంటే జాతీయ స్థాయిలో ఉండే ఈ కమిటీలో ప్రతి రాష్ట్రం నుండి ఉన్నత విలువలు కలిగిన వ్యక్తులు.. అలాగే సమాజంలో విశేష సేవలనందిస్తున్న ప్రముఖ వ్యక్తులలో ఒకరు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తారు. అలాంటి ప్రతిష్టాత్మకమైన హోదా పుట్టగుంట వెంకట సతీష్ కుమార్‌కి రావడం అభినందనీయం అని వారు పేర్కొన్నారు. 

ఇది కూడా చూడండి:  ఫార్ములా ఈ రేసు లో ఏసీబీ విచారణ కోరుతూ సిఎస్ శాంతకుమారి ఏసీబీకి లేఖ

ఎన్నో ధార్మిక సంస్థలకు విరాళాలు ఇస్తూ హిందూ దేవాలయాల అభివృద్ధికి పుట్టగుంట వెంకట సతీష్ కుమార్‌ గత ఎన్నో సంవత్సరాలుగా సేవలందిస్తున్నారు. అది మాత్రమే కాకుండా సమాజ సేవలో ముందుంటున్నారు. అలాంటి వ్యక్తి అయిన పుట్టగుంట వెంకట సతీష్ కుమార్‌ని VHP జాతీయ ట్రస్టీగా నియమించడం అభినందనీయం వారు తెలిపారు.

ఇది కూడా చూడండి: లెస్బియన్స్‌తో సహజీవనం చట్టబద్ధమే.. హైకోర్టు సంచలన తీర్పు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు